అక్కినేని కోడలిగా మొదటి సంక్రాంతి జరుపుకున్న ... భారీ ట్రోల్స్ కి గురైన నటి!

అక్కినేని నాగచైతన్య( Naga Chaitanya ), శోభితా ధూళిపాళ( Sobhita Dhulipala ) ప్రేమించుకొని గత ఏడాది డిసెంబర్ 4వ తేదీ అన్నపూర్ణ స్టూడియోలో అతికొద్దీ మంది సన్నిహితులు బంధువుల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం జరుపుకున్న విషయం తెలిసిందే .ఇలా వీరి వివాహం తర్వాత ఈ జంట మొదటి సంక్రాంతి వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నారు.

 Netizens Troll On Sobhita Sankranthi Celebrations Photos , Sobhita, Nagachaitany-TeluguStop.com

ఈ క్రమంలోనే వారి సంక్రాంతి వేడుకలకు సంబంధించిన ఫోటోలను శోభిత సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

Telugu Nagachaitanya, Netizenstroll, Sankranthi, Sobhita, Tollywood-Movie

సంక్రాంతి పండుగను పురస్కరించుకొని నాగచైతన్య శోభిత ఇద్దరు కూడా ఎంతో సంప్రదాయ దుస్తులలో కనిపించారు.మొదటినుంచి కూడా సాంప్రదాయాలకు ఎంతో విలువ ఇస్తున్నటువంటి శోభిత తన పెళ్లిలో కూడా సాంప్రదాయాన్ని పాటిస్తూ పెళ్లి వేడుకలను జరుపుకున్న విషయం మనకు తెలిసిందే.ఇలా సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేసిన ఈమె తాను నటిగా ఎంతో ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ తన మూలాలను ఎప్పటికీ మర్చిపోను అంటూ కూడా చెప్పుకోవచ్చారు.

ఇక తాజాగా సంక్రాంతి( Sankranthi ) పండుగను పురస్కరించుకొని ఈమె చీర కట్టుకొని ఎంతో సాంప్రదాయపద్ధంగా కనిపించారు.

Telugu Nagachaitanya, Netizenstroll, Sankranthi, Sobhita, Tollywood-Movie

ఇలా సంక్రాంతి వేడుకలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో శోభిత భారీ స్థాయిలో విమర్శలను ఎదుర్కొంటున్నారు.ఈమె తన భర్త చైతన్య తన పాదాలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు దీంతో విమర్శలను ఎదుర్కొంటున్నారు.ఈ ఫోటోలలో శోభిత పాదాలకు మెట్టెలు లేకపోవడంతో ఎంతోమంది నేటిజన్స్ విమర్శలు చేస్తున్నారు పెళ్లి సమయంలో సాంప్రదాయాల గురించి గొప్పగా చెప్పిన శోభితకు మెట్టెలు పెట్టుకోవడం తెలియదా అప్పుడే సాంప్రదాయాలను తీసి పక్కన పెట్టావా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరి కొందరైతే నాగచైతన్య పెళ్లి సమయంలో మెట్టెలు తొడిగేటప్పుడు ఎంతో ఎమోషనల్ అయ్యారు మరి ఆ సాంప్రదాయం కట్టుబాట్లు ఎక్కడికి పోయాయి అంటూ విమర్శలు కురిపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube