మన వంటగదిలో ఉండే మసాలా దినుసులలో ముఖ్యమైన మసాలా దినుసులలో కచ్చితంగా లవంగాలు ఉంటాయి.లవంగాలు వేయడం వల్ల వంటల రుచి పెరుగుతుందని కచ్చితంగా చెప్పవచ్చు.
చక్కటి రుచితో పాటు లవంగాలు( Cloves ) ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి.వీటిని తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి.
అయితే లవంగాలను ఎలా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

లవంగాలలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి.అలాగే వీటినీ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఒకటి లేదా రెండు లవంగాలను తిని ఒక గ్లాసు గోరువెచ్చని నీరు త్రాగడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది.లవంగాలను ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల జుట్టు రాలడం తగ్గిపోతుంది.
శరీరంలో రక్తప్రసరణ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది.నిద్రలేమి( Insomnia )ని తగ్గించడంలో కూడా లవంగాలు ఎంతో ఉపయోగపడతాయి.
రాత్రి నిద్రపోయే ముందు ఒక లవంగాన్ని తినడం వల్ల చక్కటి నిద్ర పడుతుంది.

దంతాల సమస్యను దూరం చేయడంలో కూడా లవంగాలు ఎంతగానో ఉపయోగపడతాయి.ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు నోట్లో లవంగాన్ని ఉంచి చప్పరిస్తూ నిద్రపోవాలి.ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల దంతాల నొప్పు( Teeth Pain )లు దూరమవుతాయి.
దంతాల సున్నితత్వం కూడా తగ్గిపోతుంది.దంతాలు పుచ్చిపోకుండా ఉంటాయి.
అధిక బరువు తో బాధపడేవారు రోజు ఉదయం పరిగడుపున ఒకటి లేదా రెండు లవంగాలను తినడం వల్ల అధిక బరువు సమస్య నుంచి బయటపడవచ్చు.

ముఖ్యంగా చెప్పాలంటే లవంగాలు శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో ఎంతగానో ఉపయోగపడతాయి.లవంగాలను ఉపయోగించడం వల్ల ఒక నెల రోజుల్లోనే ఆరు నుంచి ఏడు కిలోల బరువు తగ్గవచ్చు అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.అలాగే లవంగాలను తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది.
వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి( Immunity ) కూడా పెరుగుతుంది.ముఖ్యంగా చెప్పాలంటే క్యాన్సర్ వంటి ప్రాణాంతక అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండవచ్చు.
లవంగాలను ఉపయోగించడం మంచిదని అధికంగా అసలు ఉపయోగించకూడదు.