వరుసగా నాలుగోసారి ఆ రికార్డును అందుకున్న బాలయ్య.. ఈ హీరో వేరే లెవెల్!

టాలీవుడ్ నందమూరి నటసింహం బాలయ్య బాబు( Balayya Babu ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.బాలకృష్ణ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

 Daaku Maharaaj Box Office Collection Crosses 100 Crores Details, Daaku Maharaaj,-TeluguStop.com

ఈ వయసులో కూడా అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ ఈ తరం హీరోలకు గట్టి పోటీని ఇస్తున్నారు.అందులో భాగంగానే ఇప్పటికే బాలయ్య తన గత మూడు సినిమాలతో హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.

తాజాగా డాకు మహారాజ్( Daaku Maharaaj ) సినిమాతో మరో సూపర్ హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నారు బాలయ్య బాబు.ఈ మధ్య కాలంలో ఏ సీనియర్ హీరోకీ సాధ్యం కాని రేర్ ఫీట్ బాలయ్య సాధించారు.

Telugu Akhanda, Balakrishna, Balakrishna Box, Daaku Maharaaj, Tollywood-Movie

అఖండ( Akhanda ) నుంచి అన్ స్టాపబుల్ గా హిట్లు కొడుతున్నారు.నిన్నగాక మొన్నొచ్చిన డాకు మహారాజ్ తో నాలుగో హిట్టు కొట్టడమే కాదు వరసగా నాలుగోసారి 100 కోట్ల క్లబ్బులో అడుగుపెట్టి అద్దరగొట్టేసారు.బోయపాటి అఖండతో బాలయ్య ను ట్రాక్ లోకి ఎక్కించడమే కాదు, ఆయన రెండో కుమార్తె తేజస్విని( Tejaswini ) బాలయ్య లుక్స్ విషయంలో శ్రద్ధ తీసుకోవడంతో ఆయన సెకండ్ ఇన్నింగ్స్ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది.ఆయన సక్సెస్ క్రెడిట్ అంతా తేజస్వినిదే అంటూ నందమూరి అభిమానులు మాట్లాడుకుంటున్నారు.

Telugu Akhanda, Balakrishna, Balakrishna Box, Daaku Maharaaj, Tollywood-Movie

అఖండ, వీర సింహ రెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ ఇలా అన్ని బాలయ్య ఖతాలో భారీ హిట్లుగా నిలవడం నందమూరి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా చేసింది.వరస సక్సెస్ లతో జోష్ మీదున్న బాలయ్య బోయపాటి తో అఖండ 2 తో కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖాయమనే మాట అందరి నోటా వినిపిస్తోంది.ఒకవేళ అదే కనుక నిజమైతే బాలయ్య బాబు అభిమానులకు పండగే అని చెప్పాలి.ఇప్పటికే గతంలో విడుదలైన అఖండ సినిమా అఖండ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.

అఖండ 2 కూడా అంతకుమించి సక్సెస్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube