మన భారతదేశంలో ఉన్న ఆచారాలలో చెట్లు, జంతువులు, పక్షులను కూడా చాలామంది ప్రజలు పూజిస్తూ ఉంటారు.ప్రకృతిలో ఉన్న ఒక్కో చెట్టుకు ఒక విశిష్టత ఉంటుంది.
అందుకే చెట్లలో కూడా మన దేశ ప్రజలు దేవుళ్లను చూస్తూ ఉంటారు.రావి చెట్టు శ్రీకృష్ణుడికి( Lord Krishna ) ఎంతో ఇష్టమని చెబుతారు.
ఇలా ఒక్కో చెట్టు ఒక్కో దేవుడికి ఇష్టమని ప్రజలు చెబుతూ ఉంటారు.
ఇది ఇప్పటినుంచి వచ్చే ఆచారం కాదు పూర్వం నుంచి ఈ ఆచారం వస్తూ ఉంది.ఇక జంతువులను ప్రధానంగా ఆవును పూజిస్తూ ఉంటారు.సాక్షాత్తు అమ్మవారి ప్రతిరూపంగా ఆవును కొలుస్తారు.
ఇంకా చెప్పాలంటే కదంబ వృక్షం( Kadamba Tree ) ఎప్పుడైనా చూశారా.ఇది కేవలం అడవుల్లో మాత్రమే కనిపిస్తూ ఉంటుంది.
దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది సంవత్సరం పొడుగునా పచ్చగా ఉంటుంది.
ఇది శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన చెట్టు అని వేద పండితులు చెబుతున్నారు.
అడవుల్లో ఉండడంతో చాలామంది ప్రజలకు ఈ చెట్టు గురించి తెలియదు.దీని మహిమలు మాత్రం అపారం.
దీన్ని పూజిస్తే సకల పాపాలు దూరం అయిపోతాయి.దీని పువ్వులు సర్కిల్ ఆకారంలో గుండ్రంగా ఉంటాయి.
ఉత్తర భారత దేశంలో కృష్ణ వృక్షం( Krishna Tree ), దక్షిణ వృక్షమని రకరకాల పేర్లతో పిలుస్తారు.ఈ చెట్టుకు ఓం శక్తి స్వరూపిణియే అనే మంత్రం జపిస్తూ భుజించాలి.
గ్రహ దోషాలు ఉన్నవారు అమ్మవారి స్వరూపంగా భావించి దీనికి పసుపు, కుంకుమతో పూజిస్తే ఎంతో మంచిదని చెబుతూ ఉంటారు.కానీ ఇది అడవుల్లో ఉండడంతో అక్కడికి వెళ్లాలంటే చాలా మంది ప్రజలకు కుదరదు.
తోడు లేనిదే అడవికి వెళ్లడం అసాధ్యమని చెప్పవచ్చు.దీనివల్ల మహిళలు అడవులకు వెళ్లలేక ఈ చెట్టుకు పూజలు చేయడం లేదు.
కానీ ఈ చెట్టుకు పూజలు చేయడం వల్ల మనకు ఎన్నో లాభాలు ఉన్నాయని పురాణాలలో ఉంది.అడవుల్లోనే ఉండడంతో సులభంగా గుర్తించవచ్చు.పైగా సంవత్సరం అంతా పచ్చగా ఉండడంతో ఎండాకాలంలో అయినా పచ్చగా ఉంటుంది.దీంతో ఆ చెట్టును మనం సులభంగా గుర్తు పట్టవచ్చు.అంతేకాకుండా మహిళలు ఎక్కువమంది కలిసి అడవికి వెళితేనే భయం లేకుండా ఉంటుంది.ఒకరైతే అసలు వెళ్ళలేరు.
అడవికి ఎక్కువ మంది వెళ్లి పూజలు చేసుకుని తమ కోరికలు కోరుకోవచ్చు.
DEVOTIONAL