సాధారణంగా కొందరికి ముఖం మొత్తం మచ్చలు( Scars ) ఏర్పడి చర్మం అసహ్యంగా మారుతుంటుంది.ఈ మచ్చలు ముఖ సౌందర్యాన్ని మాత్రమే కాదు ఆత్మ ధైర్యాన్ని సైతం దెబ్బ తీస్తాయి.
ముఖం మొత్తం మచ్చలు ఉండడం వల్ల ఎంతో అసౌకర్యంగా ఫీల్ అవుతుంటారు.మనోవేదనకు గురవుతుంటారు.
మచ్చలను పోగొట్టుకునేందుకు ముప్ప తిప్పలు పడుతుంటారు.కొందరైతే ట్రీట్‌మెంట్ చేయించుకునేందుకు కూడా సిద్ధం అవుతారు.
మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే అసలు చింతించకండి.

ఎందుకంటే ఎలాంటి మచ్చలనైనా పోగొట్టే సామర్థ్యం పుదీనా( Mint Leaves )కు ఉంది.పుదీనాను ఇప్పుడు చెప్పబోయే విధంగా వాడితే కేవలం వారం రోజుల్లోనే క్లియర్ స్కిన్( Clear Skin ) మీ సొంతం అవుతుంది.చర్మంపై ఒక్క మచ్చ కూడా కనిపించదు.మరి ఇంకెందుకు ఆలస్యం పుదీనాతో మచ్చలను ఎలా పోగొట్టుకోవచ్చో తెలుసుకుందాం పదండి.ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో పది ఫ్రెష్ పుదీనా ఆకులు వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ పెరుగు, రెండు ఐస్ క్యూబ్స్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ ముల్తాని మట్టి, హాఫ్ టేబుల్ స్పూన్ ములేటి పౌడర్(Muleti Powder ) వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా అప్లై చేసుకుని ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.
అనంతరం వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.

రోజుకి ఒక్కసారి ఈ రెమెడీని కనుక పాటిస్తే ముఖంపై ఎలాంటి మచ్చలు ఉన్నా సరే క్రమంగా మాయం అవుతాయి.కొద్ది రోజుల్లోనే క్లియర్ స్కిన్ మీ సొంతం అవుతుంది.పైగా ఈ రెమెడీ మీ చర్మాన్ని గ్లోయింగ్ గా, షైనీ గా మారుస్తుంది.
మొటిమలను అడ్డుకుంటుంది.చర్మం పై పేరుకుపోయిన మురికి, మృత కణాలను( Deadskin Cells ) తొలగిస్తుంది.
కాబట్టి మచ్చలతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ రెమెడీని పాటించండి.మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.







