పెసలు( Green Moong Dal ) సంపూర్ణ పోషకాహారంగా పరిగణించబడతాయి.శాకాహారులకు పెసలు ఒక సూపర్ ఫుడ్ అనే చెప్పుకోవచ్చు.
పెసల్లో ప్రొటీన్, ఫైబర్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, ఫోలేట్, విటమిన్ బి వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.అందువల్ల ఆరోగ్యపరంగా ఇవి చాలా మేలు చేస్తాయి.
ముఖ్యంగా నిత్యం గుప్పెడు ఉడికించిన పెసలు తిన్నారంటే బోలెడు లాభాలు పొందుతారు.
వెయిట్ లాస్( Weight Loss ) అవ్వాలని ట్రై చేస్తున్నవారు తమ రెగ్యులర్ డైట్ లో ఉడికించిన పెసలను చేర్చుకోవచ్చు.
ఇవి తక్కువ కేలరీలతో ఎక్కువ పోషకాలుండే ఉండే ఆహారం.ఉడికించిన పెసలు తిన్నారంటే త్వరగా కడుపు నిండిన ఫీల్ ఇస్తాయి.తిన్న తర్వాత ఎక్కువసేపు ఆకలి వేయకుండా చేస్తాయి.వెయిట్ లాస్ కు సహకరిస్తాయి.

రక్తహీనత ఉన్నవారు నిత్యం గుప్పెడు ఉడికించిన పెసలను తింటే.చాలా వేగంగా ఆ సమస్య నుంచి బయటపడతారు.ప్రొటీన్‌కు పెసలు మంచి మూలం.అందువల్ల ఇవి శరీర బలాన్ని పెంచుతాయి, కండరాల నిర్మాణానికి తోడ్పడతాయి.మాంసాహారం తినని వారికీ పెసలు మంచి ప్రొటీన్ సప్లయర్.ఉడికించిన పెసల్లో ఫైబర్ కంటెంట్ కూడా అధిక మొత్తంలో ఉంటుంది.
ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.మలబద్ధకం( Constipation ) సమస్యను నివారించడంలో సహాయపడుతుంది.
అదే సమయంలో రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రణలోనూ హెల్ప్ చేస్తుంది.

ఉడికించిన పెసలను నిత్యం తీసుకోవడం వల్ల.అందులోని శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడి క్యాన్సర్ రిస్క్ ను తగ్గిస్తాయి.వృద్ధాప్యాన్ని ఆలస్యం చేస్తాయి.
పెసల్లో ఉండే మెగ్నీషియం, పొటాషియం, ఫోలేట్ లాంటి పోషకాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.గుండె సంబంధిత జబ్బుల నుంచి రక్షణ కల్పిస్తాయి.
పైగా పెసలు ఉష్ణోగ్రత తగ్గించే ఆహారం.ప్రస్తుత వేసవి కాలంలో పెసలను రెగ్యులర్ డైట్ లో భాగం చేసుకుంటే ఒంట్లో అధిక వేడి తొలగిపోతుంది.







