షాంపూలో కాఫీ పౌడ‌ర్ క‌లిపి త‌ల‌స్నానం చేస్తే ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఉదయం లేవగానే ఒక కప్పు వేడి వేడి కాఫీ తాగుతుంటే వచ్చే ఫీలింగ్ ను మాటల్లో వర్ణించలేము.ఒక్కసారి కాఫీకి ఎడిక్ట్‌ అయ్యామంటే అంత సుల‌భంగా దానిని వదిలిపెట్టలేము.

 Washing Your Hair With Coffee Powder In Your Shampoo Has Many Benefits , Coffee-TeluguStop.com

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది కాఫీకి బానిసలుగా ఉన్నారు.మితంగా తీసుకుంటే కాఫీ ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను చేకూరుస్తుందని ఇప్పటికే నిపుణులు తెలిపారు.

మ‌రోవైపు కాఫీ పౌడర్ ను చ‌ర్మ‌ సౌందర్యాన్ని మెరుగుపరచుకోవడానికి విరివిరిగా వాడుతుంటారు.

అలాగే జుట్టు సంరక్షణకు సైతం కాఫీ పౌడర్ ఉత్త‌మంగా సహాయపడుతుంది.

ముఖ్యంగా షాంపూలో కాఫీ పౌడర్ మిక్స్ చేసి హెయిర్ వాష్ చేసుకుంటే మీరు ఊహించని లాభాలు మీ సొంతమవుతాయి.అందుకోసం ఒక బౌల్‌ తీసుకుని అందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు మీ రెగ్యులర్ షాంపూను వేసుకోవాలి.

లేదా బేబీ షాంపూను వేసుకోవచ్చు.ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ ను వేసి స్పూన్ సహాయంతో బాగా మిక్స్ చేసుకోవాలి.

Telugu Coffee Powder, Coffeepowder, Care, Care Tips, Wash, Healthy, Latest, Sham

చివరిగా ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసి మరోసారి కలపాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఉపయోగించి హెయిర్ వాష్ చేసుకోవాలి.వారానికి ఒకసారి కాఫీ పౌడర్ ను మిక్స్ చేసి షాంపూ చేసుకుంటే తెల్ల జుట్టు సమస్య త్వరగా రాకుండా ఉంటుంది.ఒకవేళ ఆల్రెడీ తెల్ల జుట్టు వస్తే నల్లగా మారుతుంది.

హెయిర్ గ్రోత్ డబల్ అవుతుంది.స్కాల్ప్ శుభ్రంగా మరియు ఆరోగ్యంగా మారుతుంది.

Telugu Coffee Powder, Coffeepowder, Care, Care Tips, Wash, Healthy, Latest, Sham

అలాగే కాఫీ పౌడర్ లో ఉండే పలు సుగుణాలు జుట్టును స్మూత్ అండ్ సిల్కీగా మెరిపిస్తుంది.చాలా మంది త‌ల‌లో నుంచి బ్యాడ్ స్మెల్ వ‌స్తుందని బాధపడుతుంటారు.ఈ సమస్యను నివారించుకోవడం కోసం ఎన్నెన్నో చిట్కాలు ప్రయత్నిస్తుంటారు.అయితే అలాంటివారు కాఫీ పౌడర్ ను షాంపూలో మిక్స్ చేసి త‌ల‌స్నానం చేస్తే తలలో నుంచి దుర్వాసన రాకుండా ఉంటుంది.

పైగా కాఫీ పౌడర్ ను షాంపూలో మిక్స్ చేసి వాడటం వల్ల జుట్టు రాలడం చిట్లడం వంటి సమస్యలు సైతం తగ్గుముఖం పడతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube