చాలామంది ఈ మధ్యకాలంలో బీపీ సమస్యతో( High Blood Pressure ) ఇబ్బంది పడుతున్నారు.అయితే బీపీను నియంత్రణలో ఉంచేందుకు ఎన్నో మందులను కూడా వాడుతున్నారు.
అయితే బీపీకి అదే విధంగా కొలెస్ట్రాల్ కు కూడా అద్భుతంగా పనిచేసే దివ్య ఔషధం ఆయుర్వేదంలో మందార పువ్వు అని చెప్పవచ్చు.మందార పువ్వు( Hibiscus ) పూర్వీకులు అనారోగ్యాల సమస్యలనుంచి ఉపశమనం పొందడానికి వినియోగించేవారు.
ఆయుర్వేద శాస్త్రంలో కూడా మందారం పువ్వుకు ఎంతో ప్రాధాన్యత ఉంది.
ఈ పువ్వు చాలా రకాల అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందేందుకు సహాయపడుతుంది.
అయితే ప్రస్తుతం ఈ పువ్వుకు మాత్రం మార్కెట్లో ఎంతో డిమాండ్ పెరిగి ఉంది.దీంతో తయారు చేసే ప్రొడక్ట్స్ మార్కెట్ లో విచ్చలవిడిగా లభిస్తున్నాయి.
అయితే మందార పువ్వుతో చర్మాని( Skin care )కి సంబంధించినవి అలాగే జుట్టుకు సంబంధించినవి ఎన్నో ప్రొడక్ట్స్ లభిస్తున్నాయి.అదే విధంగా ఈ పువ్వుతో తయారుచేసిన డికాషన్ తాగడం వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయి.
అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మందారం పువ్వుతో డికాషన్ చేసుకొని ప్రతిరోజు తాగడం వలన అధిక రక్తపోటు సమస్య సులభంగా దూరమవుతుంది.అంతేకాకుండా రక్తం మెరుగుపడుతుంది.దీంతో అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు.
ఈ మధ్యకాలంలో చాలా మందిలో గుండెపోటు సమస్యలు వస్తున్నాయి.అయితే ఈ సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు మందార పువ్వుని డికాషన్ ని తాగడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
అంతేకాకుండా ఈ మందారం టీ ని తాగడం వలన గుండెపోటు సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.

ఇక బయట ఆహారాలు తీసుకోవడం వల్ల చాలా మందిలో కొలెస్ట్రాల్ పెరిగిపోతోంది.ఇక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్న వారు తప్పకుండా మందారం పువ్వుతో తయారు చేసిన టీ నీ తాగితే కొలెస్ట్రాల్ చాలా త్వరగా తగ్గుతుంది.అదే సమయంలో తీవ్ర అనారోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు.
ఇక ఈ మందారం టీ లో కాస్త తేనెను కలుపుకొని తీసుకుంటే బరువు తగ్గడమే కాకుండా జీర్ణ సమస్యల నుండి కూడా ఉపశమనం పొందవచ్చు.








