1.కేసిఆర్ పై షర్మిల కామెంట్స్
తెలంగాణ సీఎం కేసీఆర్ కు మాటల్లో ఉన్న చిత్తశుద్ధి చేతల్లో కనిపించడం లేదని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు.
2.తెలంగాణ ఎంపీలకు గద్దర్ డిమాండ్లు
నూతన పార్లమెంట్ భవనానికి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని చర్చ చేయాల్సిందిగా తెలంగాణ ఎంపీలకు గద్దర్ డిమాండ్ చేశారు.
3.కెసిఆర్ పై అరవింద్ విమర్శలు
తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలపై బిజెపి కమిటీ వేసిందని బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు.రైతులను కూలీలుగా మార్చిన ఘనత కేసిఆర్ దేనని ఆయన విమర్శించారు.
4.నీతి అయోగ్ సీఈవో తో చంద్రబాబు భేటీ
జి 20 సమావేశంపై నీతి అయోగ్ సీఈవో పరమేశ్వరన్ అయ్యర్ తో టిడిపి అధినేత చంద్రబాబు భేటీ అయ్యారు.
5.ఎంపీ గోరంట్లకు నిరసన సెగ
హిందూపురంలో ఎంపీ గోరంట్ల మాధవ్ కు నిరసన సెగ తరిగింది.అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించేందుకు వచ్చిన గోరంట్ల మాధవ్ ను దళిత సంఘాలు అడ్డుకున్నాయి.మున్సిపల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ఆవిష్కరణ చేయకపోవడం ఏంటంటూ మండిపడ్డారు.
6.లోకేష్ 24 గంటల ఛాలెంజ్
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కి తనపై ఆరోపణలు చేస్తున్న వైసీపీ నాయకులకు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సవాల్ విసిరారు.స్కిల్ డెవలప్మెంట్ కు సంబంధించి తనపై చేస్తున్నారని, దమ్ముంటే 24 గంటల్లో ఆధారాలు బయట పెట్టాలని ట్విట్టర్ వేదికగా ఛాలెంజ్ చేశారు.
7.పవన్ కళ్యాణ్ పిలుపు
బాబా సాహెబ్ డియర్ అంబేద్కర్ ఆశయాలను, ఆకాంక్షలను అందరూ అర్థం చేసుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.
8.నేడు మహా దీపోత్సవం
అరుణాచలేశ్వరాలయం లో కార్తీక మహా దీపోత్సవం మంగళవారం సాయంత్రం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.
9.మాతృభాష మరవద్దు : వెంకయ్య నాయుడు
అరుణాచలేశ్వర ఆలయం లో కార్తీక మహాదేవ ఉత్సవం అత్యంత వైభవంగా ఈరోజు నిర్వహించనున్నారు.
10.తిరుమల సమాచారం
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది నేడు శ్రీవారి సర్వ దర్శనానికి ఆరు గంటల సమయం పడుతోంది.
11.డ్రగ్స్ తో కేసీఆర్ కుటుంబానికి లింకు
బెంగళూరు హైదరాబాద్ డ్రగ్స్ కేసులతో సీఎం కేసీఆర్ కుటుంబానికి సంబంధం ఉందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు.
12.ప్రజలను బహిష్కరించే అధికారం పంచాయతీకి లేదు : హై కోర్ట్
పంచాయతీ పరిధిలో నివసిస్తున్న గుత్తుకోయ గిరిజనులను చత్తిస్ ఘడ్ రాష్ట్రానికి పంపాలని పేర్కొంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుకొండ మండలం బెండల పాడు పంచాయతీ చేసిన తీర్మానాన్ని హైకోర్టు కొట్టివేసింది.
13.తెలంగాణ క్యాబినెట్ భేటీ
ఈనెల 10వ తేదీన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
14.పాదయాత్ర ముగింపు సభ 16 నే
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన అదిగో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ కరీంనగర్ లో ఈనెల 16నే ఉంటుందని యాత్ర ప్రముఖ్ జి.మనోహర్ రెడ్డి తెలిపారు.
15.లా కాలేజీ ప్రవేశాలను రద్దు చేయండి
ఎస్కేయూ యూనివర్సిటీ లా కాలేజీలో 2022- 23 అడ్మిషన్లను రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖకు వర్సి రిజిస్టర్ ఎంపీ లక్ష్మయ్య లేఖ రాశారు.
16.ఏపీకి ప్రత్యేక హోదాపై రఘురామ కామెంట్స్
ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావడం కోసం ఎంపీ పదవీకి రాజీనామా చేసేందుకు సిద్ధమని, మూకుమ్మడిగా ఈనెల 29న ఎంపీలందరం రాజీనామా చేద్దామని వైసిపి ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు.
17.టిఆర్ఎస్ హామీలపై పోరాటం : టి.టీడీపీ
దళితులకు టిఆర్ఎస్ ఇచ్చిన హామీలపై రాజీలేని పోరాటం చేస్తామని తెలంగాణ టిడిపి అధ్యక్షుడు జ్ఞానేశ్వర్ అన్నారు.
18.బోయింగ్ అధ్యక్షుడితో కేటీఆర్ భేటీ
ప్రముఖ విమానయాన సంస్థ బోయింగ్ అధ్యక్షుడు మైకేల్ అర్జున్ తో తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రగతిభవంలో సమావేశం అయ్యారు.
19.సవరత ఫౌండేషన్ కు ఆ బాధ్యతలు అప్పగించ వద్దు
ఏపీలోని దళితవాడలో దేవాలయాల నిర్మాణ బాధ్యతలను ఆర్ఎస్ఎస్ ప్రోత్సాహంతో నడుస్తున్న సవరత ఫౌండేషన్ కు అప్పగించవద్దని సీపీఎం రాష్ట్ర కమిటీ నిర్ణయించింది.
20.అండమాన్ లో అల్పపీడనం
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో దక్షిణ అండమాన్ సముద్రం పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడింది.
ఈ ప్రభావంతో మంగళవారం సాయంత్రానికి ఆగ్నేయ బంగాళాఖాతంలో ప్రవేశించి వాయుగుండం గా బలపడనుంది.