ఈ హెర్బ‌ల్ టీను తీసుకుంటే క్ష‌ణాల్లో ఒత్తిడి మాయం అవుతుంది!

నేటి ఆధునిక కాలంలో వయసుతో సంబంధం లేకుండా దాదాపు అందరినీ సర్వసాధారణంగా వేధిస్తున్న‌ సమస్య ఒత్తిడి.ఇది చాలా చిన్న సమస్యగానే అనిపించినా.

 Consuming This Herbal Tea Will Relieve Stress In Seconds! Herbal Tea, Stress, St-TeluguStop.com

అనేక ముప్పులను తెచ్చి పెడుతుంది.అందుకే ఒత్తిడికి లోనైనప్పుడు ఎంత త్వరగా దాని నుండి బయట పడగలిగితే ఆరోగ్యానికి అంత మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.

అయితే ఇప్పుడు చెప్పబోయే హెర్బల్ టీ ఒత్తిడిని క్షణాల్లో దూరం చేయడంలో అద్భుతంగా సహాయపడుతుంది.

మరి ఇంతకీ ఆ హెర్బల్ టీ ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోయాలి.వాటర్ హీట్ అవ్వగానే అందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం తరుగు.

ఐదు ఫ్రెష్ పుదీనా ఆకులు, పావు స్పూన్ పసుపు, పావు స్పూన్ మిరియాల పొడి, కొద్దిగా యాలకుల పొడి వేసి పది నుంచి ప‌దిహేను నిమిషాల పాటు మరిగించాలి.

Telugu Tips, Herbal Tea, Herbaltea, Latest, Stress, Stress Tea-Telugu Health Tip

ఇలా మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకుని వన్ టేబుల్ స్పూన్ తేనె కలిపితే టేస్టీ అండ్ హెల్తీ హెర్బల్ టీ సిద్ధం అవుతుంది.ఒత్తిడికి లోనైనప్పుడు ఒక కప్పు ఈ హెర్బల్ టీ ని తీసుకుంటే చాలా మంచిది.ఈ హెర్బ‌ల్ టీ ఒత్తిడిని క్షణాల్లో దూరం చేస్తుంది.

మెదడు మ‌రియు శరీరాన్ని రిలాక్స్ చేస్తుంది.తలనొప్పి, ఆందోళన వంటి సమస్యలు సైతం తగు ముఖం పడతాయి.

అంతేకాదు రోజుకి ఒక్కసారి ఈ హెర్బల్ టీను తీసుకోవడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది.సీజనల్ వ్యాధులు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.

జలుబు, దగ్గు వంటి సమస్యలు ఉన్నా.వాటి నుంచి త్వరగా ఉపశమనం పొందుతారు.

మరియు శరీరంలో క్యాన్సర్ కణాలు సైతం వృద్ధి చెందకుండా ఉంటాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube