రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిన్నారి రమ్య యాక్సిడెంట్ కేసులో ఎటువంటి పురోగతి లేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.కేసు విచారణలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని వాపోతున్నారు.
డిశ్చార్జ్ పిటిషన్ తో నిందితులు తప్పించుకుంటున్నారని తెలిపారు.ప్రభుత్వం కౌంటర్ వేయకుండా నిందితులకు సహకరిస్తుందని తెలిపారు.
ఈ కేసులో ఏ-2 నిండితుడు తల్లి హైకోర్టు లాయర్ కావడంతో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆమెకు సహకరిస్తున్నారని రమ్య తండ్రి ఆరోపించారు.పేదవారికి ప్రభుత్వం న్యాయం చేయదని మరోసారి రుజువైందని ఆవేదన వ్యక్తం చేశారు.2016 సంవత్సరంలో పంజాగుట్టలో మద్యం మత్తులో ఇంజనీరింగ్ విద్యార్థులు చేసిన కారు యాక్సిడెంట్ లో చిన్నారి రమ్య మృతి చెందిన విషయం తెలిసిందే.







