సమ్మర్ సీజన్ స్టార్ట్ అయింది.ఈ సీజన్‌లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంత కష్టమో.
చర్మ సౌందర్యాన్ని సంరక్షించుకోవడం కూడా అంతే కష్టం.వేసవి వేడి, మండే ఎండలు, అధిక చెమటలు, ఉక్కపోత కారణంగా చర్మ సౌందర్యం తీవ్రంగా దెబ్బ తింటుంది.
మేకప్ వేసుకున్నా కొన్ని గంటల్లోనే చెదిరిపోతుంటుంది.పైగా సన్ ట్యాన్, పింపుల్స్, ఆయిల్ స్కిన్ ఇలా ఎన్నో సమస్యలు కూడా ఇబ్బంది పెడతాయి.
అయినా సరే అందంగా, ఆకర్షణీయంగా కనిపించాలని తెగ ఆశ పడుతుంటారు.అలాంటి వారు ఇప్పుడు చెప్పబోయే సింపుల్ రెమెడీని ట్రై చేస్తే సమ్మర్‌లోనూ స్కిన్‌ను బ్రైట్‌గా, వైట్‌గా మెరిపించుకోవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటీ.? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? వంటి విషయాలపై ఓ లుక్కేసేయండి.
ముందుగా ఒక నిమ్మ కాయను తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి తొక్కతో పాటుగానే ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని గ్లాస్ వాటర్ పోయాలి.వాటర్ హీట్ అవ్వగానే అందులో రెండు టేబుల్ స్పూన్ల అవిసె గింజలు, రెండు టేబుల్ స్పూన్ల వైట్ రైస్, కట్ చేసి పెట్టుకున్న నిమ్మకాయ ముక్కలు వేసి పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించాలి.
ఆ తర్వాత ఉడికించుకున్న పదార్థాలను మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకుని.దాని నుంచి జ్యూస్‌ను సపరేట్ చేసుకోవాలి.ఈ జ్యూస్‌లో వన్ టేబుల్ స్పూన్ బంగాళదుంప రసం, వన్ టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టి, హాఫ్ టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ వేసుకుని మిక్స్ చేసుకుని ముఖానికి, మెడకు అప్లై చేసుకోవాలి.

బాగా ఆరిన అనంతరం మెల్ల మెల్లగా స్క్రబ్ చేసుకుంటూ వాటర్‌తో చర్మాన్ని శుభ్రం చేసుకోవాలి.రెండు రోజులకు ఒక సారి ఇలా చేస్తే స్కిన్ బ్రైట్‌గా, వైట్‌గా మారింది.మృత కణాలు తొలగిపోతాయి.
స్కిన్ ఆయిలీగా మారకుండా ఉంటుంది.మరియు చర్మం స్మూత్‌గా కూడా మారుతుంది.
.