నెలసరి అంటేనే ఆడవారు ఓ పెద్ద గండంగా ఫీల్ అవుతుంటారు.ఎందుకంటే, ఈ సమయంలో నడుం, పొట్ట, కాళ్లు, చేతులు తీవ్రంగా నొప్పులు పుడుతుంటాయి.
చికాకు తారా స్థాయిలో ఉంటుంది.ఇక నీరసం, అలసట, తిమ్మిర్లు వంటి సమస్యలు సైతం తెగ విసిగిస్తాయి.
అందుకే నెలసరి అంటేనే భయపడుతుంటారు.అయితే నెలసరి నొప్పులను నివారించి.
మూడ్‌ను కూల్ చేయడంలో కొన్ని కొన్ని పండ్లు అద్భుతంగా సమాయపడతాయి.మరి ఆ పండ్లు ఏంటో చూసేయండి.
అరటిపండ్లు రుచిగా ఉంటాయి, తక్కువ ధరకే లభిస్తాయి, ఆరోగ్యానికి బోలెడన్ని ప్రయోజనాలు అందిస్తాయి.అలాగే నెలసరి సమయంలో ఇబ్బంది పెట్టే నడుము నొప్పి, తల నొప్పి, పొత్తి కడుపు నొప్పి, కాళ్ల నొప్పి వంటి వాటిని కూడా తగ్గిస్తాయి.
పైగా అరటి పండు తీసుకుంటే శరీరాం యాక్టివ్‌గా, ఎనర్జిటిక్‌గా ఉంటుంది.అందుకే ఆడవారు నెలసరి సమయంలో ఖచ్చితంగా రోజూ అరటి పండు తీసుకోవడం మంచదని నిపుణులు చూస్తున్నారు.
అలాగే కివీ పండ్లూ నెలసరి సమయంలో ఎంతో మేలు చేస్తారు.

చాలా మంది నెలసరి సమయంలో గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలను ఫేస్ చేస్తాయి.అయితే కివీ పండు తీసుకుంటే.అందులోని యాక్టీనిడిన్ ఎంజైమ్ జీర్ణక్రియను వేగవంతం చేసి జీర్ణ సంబంధిత సమస్యలను దరి చేరకుండా అడ్డు కట్ట వేస్తుంది.
మరియు కివీలోని ఇతర పోషకాలు నెలసరి సమస్యల నుంచి ఉపశమనాన్ని అందించి మూడ్ ప్రశాంతంగా మార్చుతుంది.

అవకాడో పండు హెల్త్‌కి ఎన్నో బెనిఫిట్స్‌ను అందిస్తుంది.ముఖ్యంగా నెలసరి సమయంలో అవకాడో పండును డైట్‌లో చేర్చుకుంటే.తిమ్మిర్లు తగ్గుతాయి.
నీరసంగా మారిన శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది.మరయు మూడ్‌స్వింగ్స్‌కు దూరంగా ఉండొచ్చు.
ఇక ఇవే కాకుండా పుచ్చకాయ, బెర్రీ పండ్లు వంటి కూడా తీసుకుంటే చాలా మంచిది.