కాకరకాయ చేదుగా ఉంటుందని చాలా మంది తినటానికి ఇష్టపడరు.అయితే కాకరకాయలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.
ఆ ఔషధ గుణాలు గురించి తెలుసుకుంటే తప్పనిసరిగా
కాకరకాయను తినటం అలవాటు చేసుకుంటారు.ఇప్పుడు కాకరకాయలో ఉన్న ఔషధ గుణాలు
అవి మన ఆరోగ్యానికి ఎలా సహాయపడతాయో తెలుసుకుందాం.
రక్తంలో షుగర్ లెవల్స్ ని బేలన్స్ చేయగల సామర్ధ్యం కాకరకాయకు ఉంది.అలాగే కాకరకాయ జ్వరాన్ని కూడా తగ్గిస్తుంది.ఆకలిని పెంచి కడుపునొప్పిని తగ్గిస్తుంది.నులిపురుగులను సైతం నశింపజేయగల ఔషధంగా పనిచేస్తుంది.
శరీరంలో ఉన్న అధిక కొలస్ట్రాల్ ని తగ్గించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.
కాకరకాయలో విటమిన్-ఎ రిబోప్లావిన్ సమృద్ధిగా ఉండుట వలన కంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది.
అంతేకాక కాకరకాయలో మలబద్దకాన్ని నివారించే ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి.కాకరకాయను వీలైనంత ఎక్కువగా అంటే రోజు విడిచి రోజు ఆహారంలో తింటుంటే రక్తప్రసరణ చక్కగా జరిగి, తద్వారా కొవ్వు కరిగి శరీరం నాజూకుగా ఉండేందుకు తోడ్పడుతుంది.
కాకర కాయ వలన బిపి కూడా కంట్రోల్ లో ఉంటుంది.వారంలో ఒకసారి బెల్లం, చింతపండుతో వండిన కాకరకాయ కూర తింటే ఆకలి పెరిగి, అజీర్ణం తగ్గతుంది.
ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న కాకరకాయను నిదానంగా తినటం అలవాటు చేసుకోండి.