సత్తు పొడి( Sattu powder ) ఈ పేరు వినే ఉంటారు.కానీ చాలా మందికి సత్తు పౌడర్ అంటే ఏమిటో పెద్దగా అవగాహన లేదు.
ఇటీవల ఫిట్‌నెస్ ప్రపంచంలో సత్తు పౌడర్ అత్యంత ప్రజాదరణ పొందుతోంది.ఈ నేపథ్యంలోనే సత్తు పొడి అంటే ఏమిటి.? అసలు సత్తు పొడితో ఎలాంటి ఆరోగ్య లాభాలు పొందొచ్చు.? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.సత్తు పొడి అనేది వేయించిన శనగలు లేదా బార్లీ( Barley )తో తయారు చేయబడే ప్రోటీన్ రిచ్ పిండి.భారతదేశంలోని జార్ఖండ్, బీహార్, పంజాబ్, ఉత్తరాఖండ్ తో సహా అనేక ప్రాంతాల్లో సత్తు పొడి బాగా ప్రాచుర్యం పొందింది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా సూపర్ మార్కెట్స్ లో సత్తు పొడి సులభంగా లభిస్తోంది.సత్తు పౌడర్‌లో ప్రొటీన్, ఫైబర్, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, కాపర్ వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి.అందువల్ల సత్తు పౌడర్ ఒక సూపర్ ఫుడ్ అని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.సత్తు పౌడర్ వేసవి కాలానికి ఎంతో అనువైనది.సత్తుతో తయారు చేసిన పానీయం వేసవి తాపాన్ని తీరుస్తుంది.శరీర ఉష్ణోగ్రతను గణనీయంగా తగ్గించి మంచి కూలింగ్ ఎఫెక్ట్ ను ఇస్తుంది.
అలాగే సత్తు పౌడర్ అధిక బరువును తగ్గించడానికి ఉత్తమంగా సహాయపడుతుంది.సత్తు పౌడర్ లో ప్రోటీన్ మరియు ఫైబర్ కంటెంట్ మెండుగా ఉంటాయి.అందువల్ల సత్తు పౌడర్ ను డైట్ లో చేర్చుకుంటే ఆకలి కోరికలు దూరం అవుతాయి.జీర్ణక్రియ చురుగ్గా మారుతుంది.మరియు కేలరీలు వేగంగా బర్న్ అవుతాయి.మధుమేహం ఉన్న వ్యక్తులకు సత్తు పౌడర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
సత్తు పౌడర్ తక్కువ గ్లైసెమిక్ సూచిక ను కలిగి ఉంటుంది.కాబట్టి ఇది రక్తంలో గ్లూకోజ్‌ను నెమ్మదిగా విడుదల చేస్తుంది, రక్తంలో చక్కెర స్థాయిలను సమర్థవంతంగా నియంత్రిస్తుంది.
అధిక-ప్రోటీన్ కలిగి ఉన్నందున కండరాల మరమ్మత్తు మరియు పెరుగుదలకు సత్తు పౌడర్ గొప్ప ఎంపిక అని నిపుణులు చెబుతున్నారు.అంతేకాకుండా సత్తు పౌడర్ ను డైట్ లో చేర్చుకోవడం వల్ల జుట్టు కుదుళ్లు బలంగా మరియు ఆరోగ్యంగా మారతాయి.
చర్మం నిగారింపు మెరుస్తుంది.మలబద్ధకం సమస్య ఉంటే పరార్ అవుతుంది.
అయితే ఆరోగ్యానికి మంచిదని సత్తు పౌడర్ ను ఎక్కువ మోతాదులో తీసుకుంటే మాత్రం కడుపులో గ్యాస్ సమస్య ( Gas problem)తలెత్తుతుంది.