సినిమా పరిశ్రమ అనేది ఓ మహా ప్రవాహం.ఇందులోకి చాలా మంది నటీ నటులు వస్తుంటారు.
పోతుంటారు.కానీ చాలా తక్కువ మంది సక్సెస్ అవుతారు.
అలా సక్సెస్ కావాలంటే టాలెంట్ తో పాటు లక్ కూడా ఉండాలి.అలా అందం, అభినయంతో పాటు బోలెడంత అదృష్టం కలిగిన హీరోయిన్లు తాజాగా వెండి తెరకు పరిచయం అయ్యారు.
కరోనా కారణంగా వీరు నటించిన సినిమాలు ఓటీటీల్లో రిలీజ్ అయినా.మంచి విజయాన్ని అందుకుని మంచి పేరు సంపాదించుకున్నారు.కొత్త సినిమాలతో ముందుకొచ్చి సక్సెస్ కొట్టిన హీరోయిన్లు ఎవరో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
వర్ష బొల్లమ్మ

చూసి చూడంగానే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.తొలి సినిమాతోనే మంచి గుర్తింపు దక్కించుకుంది.ఆ తర్వాత శర్వానంద్ హీరోగా జాను, మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాల్లో నటించింది.తాజాగా తెలుగులో మరో సినిమాలో అవకాశం దక్కించుకుంది.
రూపా కొడువారి

అటు సత్యదేవ్ హీరోగా వచ్చిన ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది తెలుగు బ్యూటీ రూపా కొడువారి.తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ప్రీతి అస్రాని

సుమంత్ హీరోగా వచ్చిన మళ్ళీ రావా మూవీలో చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చిన ప్రీతి అస్రాని ప్రెజర్ కుక్కర్ మూవీతో హీరోయిన్ గా మారింది.తన నటనతో మంచి క్రేజ్ తెచ్చుకుంది.
అప్సర రాణి

ఆర్జీవీ మూవీ ఉల్లాలా ఉల్లాలాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది అప్సర రాణి.ప్రస్తుతం పలు టాప్ హీరోల సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేస్తుంది.పలు అవకాశాలతో ముందుకు సాగుతుంది.
షాలిని వర్ణికట్టి

కృష్ణ అండ్ లీల, భానుమతి రామకృష్ణ మూవీస్ తో షాలిని వర్ణికట్టి హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అయ్యింది.
ఎస్తేర్ అనీల్

దృశ్యంలో సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా చేసిన ఎస్తేర్ అనీల్.జోహార్ మూవీతో హీరోయిన్ గా మారింది.
ప్రియాంక శర్మ

నందు హీరోగా ప్రియాంక శర్మ సవారీ మూవీతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది.ప్రస్తుతం మరో రెండు సినిమాల్లో నటిస్తుంది.