నడుము నొప్పితో బాధపడుతున్నారా.. అయితే ఈ చిట్కాలు మీ కోసమే!

ప్రస్తుత కాలంలో ఎవరిని పలకరించినా కూడా నొప్పులు ఉన్నాయని బాధపడుతూనే ఉంటారు.చిన్నా, పెద్దా అని వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరిలోనూ ఈ నడుము నొప్పి అనేది ఎక్కువ బాధ కలిగిస్తుంది.

 Back Pain Best Tips Health Tips Back Pain, Best Tips, Health Tips, Garlic, Son-TeluguStop.com

ఈ పోటీ ప్రపంచంలో అసలే గంటల తరబడి కూర్చుని పనులు చేయడం ద్వారా ఎక్కువ శాతం నడుము నొప్పికి గురవుతున్నారు.ఎన్ని రకాల మందులు వాడినా అప్పటికీ మాత్రమే ఉపశమనం కలుగుతుంది.

మరి నడుము నొప్పిని ఎలా నివారించాలో ఇక్కడ తెలుసుకుందాం.

కొద్దిగా అల్లంను తీసుకుని దానిని మెత్తగా రుబ్బి నొప్పి ఉన్నచోట అప్లై చేయాలి.

ఒక ఇరవై నిమిషాలు ఆగిన తర్వాత మీకు నడుము నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.అలాగే కొన్ని అల్లం ముక్కలను బాగా మరిగించి, ఆ నీటిని చల్లార్చిన తర్వాత ఒక రెండు స్పూన్ల తేనెను కలుపుకుని తాగడం ద్వారా తొందరగా నడుము నొప్పి తగ్గు ముఖం పడుతుంది.

ఇది పరగడుపున తాగడం వల్ల మంచి ఫలితాన్ని పొందవచ్చు.

కొద్దిగా ఆవ నూనె, నువ్వుల నూనె రెండు సమపాళ్లలో కలుపుకుని, గోరువెచ్చగా నూనెను వేడిచేసి నొప్పి ఉన్న చోట బాగా మర్దన చేయడం ద్వారా నడుము నొప్పితో పాటు ఇంకా ఏ రకమైన కీళ్ల నొప్పులు ఉన్నా కూడా తొందరగా తగ్గిపోతాయి.

శొంఠి బాగా నూరి ఒక మిశ్రమంలా తయారు చేసుకొని నొప్పి ఉన్నచోట పట్టాలా వేసుకోవాలి.దీనిపై తెల్ల జిల్లేడు ఆకులను పెట్టి కట్టు కట్టడం ద్వారా నడుము నొప్పి నుంచి ఉపశమనం పొందుతారు.

ఇలా తరచూ చేస్తూ ఉండటం ద్వారా నడుము నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ద్విచక్ర వాహనాలు నడిపేవారు నిటారుగా కూర్చొని నడపడం, ఆఫీసులో వర్క్ చేసేవారు రెండు కాళ్లు సమాంతరంగా నేలకు ఉండేలా చూసుకోవాలి.వెన్నును వంచకుండా నిటారుగా ఉండేలా కూర్చోవాలి.ఎక్కువసేపు ఒకే చోట కూర్చోకుండా గంటకు ఒక సారైనా లేచి అటూ ఇటూ నడుస్తూ ఉండాలి.

ఇలా చేయడం ద్వారా నడుము నొప్పి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.

వీటితోపాటు బలమైన ఆహారం తీసుకోవడం ద్వారా నడుము నొప్పి రాకుండా నివారించుకోవచ్చు.

అందులో మినప్పప్పు చాలా ముఖ్యమైనది.ఇందులో ఉన్న ఫైబర్, విటమిన్స్, ప్రొటీన్లు, శరీరానికి మంచి పోషణ కలిగిస్తాయి.

ఈ పప్పు ఎముకల్లో బలాన్ని చేకూరుస్తుంది.వీటితో పాటు పండ్లు, క్యాల్షియం అధికంగా ఉన్న పదార్థాలు తీసుకోవడం ద్వారా నడుము నొప్పి నుంచి నివారణ పొందవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube