బుధవారం నాడు గణేషుడిని ఇలా పూజిస్తే.. రెట్టింపు ఫలితాలు మీ సొంతం..!

హిందూమతంలో బుధవారం( Wednesday ) నాడు గణేషుడికి ( Ganesha ) ప్రత్యేకంగా అంకితం చేయబడింది.అయితే బుధవారం నాడు వినాయకుడిని పూజించడం వలన మనిషికి ఉన్న అన్ని ఆటంకాలు, కష్టాలు, రోగాలు, దరిద్రం తొలగిపోతాయని ఒక నమ్మకం.

 Worship Ganesha On Wednesday For Getting Good Results Details, Ganesha, Worship-TeluguStop.com

అంతేకాకుండా మత విశ్వాసాల ప్రకారం ప్రతి దేవీ దేవతల సహా అందరూ మొదట గణేశున్ని పూజిస్తారు.ఏ శుభకార్యంలో అయినా కూడా ముందుగా వినాయకుడిని పూజిస్తారు.

ఇక బుధవారం నాడు గణేషుడిని పూజించడం వలన కలిగే ప్రయోజనాలు రెట్టింపు అవుతాయని నమ్మకం.శివపార్వతుల తనయుడు గణేశుడు శివునికి ఎంతో ప్రీతిపాత్రుడు.

గణేశుడు బుధ గ్రహానికి కారకదేవుడు.అందుకే బుధవారం నాడు వినాయకుడిని ప్రత్యేకంగా పూజిస్తారు.

Telugu Bhakti, Devotional, Ganesha, Ganesha Pooja, Maha Shiva, Parvati Devi, Poo

ఇలా చేయడం వలన అతనికి ఎంతో సంతోషం కలుగుతుంది.దీంతో భక్తుల బాధలను తొలగిస్తాడు.గణేషుడిని సంతోష పెట్టడానికి బుధవారం నాడు చేయాల్సిన మార్గాలను ఇప్పుడు తెలుసుకుందాం.గణేశుడికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం.అందుకే బుధవారం నాడు గణేశుని ఆరాధన సమయంలో ఎర్రటి కుంకుమాన్ని తీసుకొని తిలకాన్ని దిద్దాలి.ఇలా చేస్తే భక్తులపై వినాయకుని అనుగ్రహం ఉంటుంది.

శ్రీ విశ్వేశ్వరుడినీ ఆరాధించే సమయంలో తప్పనిసరిగా గడ్డిని సమర్పించాలి.దర్భలు అంటే గణేశుడికి చాలా ఇష్టం.

అందుకే గడ్డితో పూజిస్తే వినాయకుడు చాలా సంతోషిస్తాడు.శమీ మొక్క అంటే జమ్మి మొక్క.

ఇది కూడా వినాయకుడికి చాలా ప్రీతికరమైనది.

Telugu Bhakti, Devotional, Ganesha, Ganesha Pooja, Maha Shiva, Parvati Devi, Poo

అందుకే బుధవారం నాడు వినాయకునికి తప్పనిసరిగా శమీ మొక్కలను( Shami Plant ) సమర్పించాలి.ఇలా చేయడం వలన ఇంట్లో సుఖసంపద శాంతి కలుగుతాయి.హిందూమతంలో పూజ సమయంలో బియ్యాన్ని అక్షతలుగా సమర్పిస్తారు.

ఎందుకంటే పూజలో అక్షతలు చాలా పవిత్రమైనవిగా భావిస్తారు.అయితే గణేశుడికి అన్నం కూడా చాలా ఇష్టం.

పొడి బియ్యాన్ని గణేశుడికి సమర్పించకూడదు.పూజా సమయంలో బియ్యాన్ని అన్నంగా లేదా పాయసం గా చేసి నైవేద్యంగా సమర్పించాలి.

దీంతో గణేశుడు సంతోషించి తన భక్తులు కోరిన కోరికలను నెరవేరుస్తాడు.గణేషుడికి పండ్లను, అటుకులను పూజ అనంతరం నైవేద్యంగా సమర్పించాలి.

బుధవారంనాడు వినాయకుడికి బెల్లం నైవేద్యంగా సమర్పించడం చాలా ఫలవంతం.దీంతో గణేశుని అనుగ్రహం వలన ఇంట్లో ధనానికి సంబంధించిన అన్ని సమస్యలు కూడా తీరిపోతాయి.

దీంతో జీవితంలో ఆనందం ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube