ఇల్లు నిర్మిస్తున్నప్పుడు లేదా నిర్మించాక ఇంట్లో ఏం పెట్టుకోవాలి? ఎలాంటి వస్తువులు పెట్టుకోవాలి? అన్నది మనకు కచ్చితంగా కనీస అవగాహన ఉండాలి.లేకపోతే మనం లేనిపోని సమస్యల్లో పడిపోతాం.
అయితే చాలామంది ఇళ్లలో మనం అక్వేరియం( Aquarium ) చూస్తూ ఉంటాం.అందులోనీ రంగు రాళ్ళలో చేపలను ( Fish in colored stones )వేసి పెంచుతూ ఉంటారు.
అయితే ఇలాంటివన్నీ చూడడానికి అందంగానే ఉంటాయి.
కానీ అవి ఇంట్లో ఉండడం మాత్రం అంత మంచిది కాదు.
అయితే ఇంట్లో అక్వేరియాలను ఉంచుకుంటే చెడు జరుగుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.కేవలం అక్వేరియం కాకుండా ఇంకా చాలా వస్తువులు ఇంట్లో ఉంచితే మనకు సమస్యలు వస్తాయి.
అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.తొట్టిలో లేదా గాజు పెట్టెలో నీళ్లు పోసి చేపలను పెంచడం వలన ఆ ఇంటి యజమానికి అన్ని కష్టాలే కలుగుతాయి.
అలాగే మానసిక ఆనందం కూడా దూరం అవుతుంది.అదేవిధంగా అప్పులు కూడా పెరుగుతాయి.
అందుకే ఆక్వేరియాన్ని ఇంట్లో ఉంచకూడదు.
అదేవిధంగా ఇంట్లో పని చేయని గడియారాలు కూడా ఉంచకూడదు.అలాగే మహాభారత యుద్ధ సన్నివేశాలకు సంబంధించిన ఫోటోలు, పోస్టర్లు ఇంట్లో అస్సలు అంటించకూడదు.వీటిని ఇంట్లో ఉంచితే ఆ ఇంటి వారికి అన్ని కష్టాలే ఎదురవుతాయి.
ఇక చాలామంది ఇళ్లలో డబ్బులు వస్తాయన్న ఆశతో, అదృష్టం, ధనం కలిసి వస్తుందని మనీ ప్లాంట్లను పెంచుతూ ఉంటారు.కానీ నిజానికి మనీ ప్లాంట్లను( Money plants ) కూడా ఇంట్లో అస్సలు పెట్టుకోకూడదు.
వాటి వల్ల ఇంట్లో మొత్తం నెగిటివ్ ఎనర్జీ ప్రసారమవుతుంది.
దీంతో ఇంట్లోకి దుష్టశక్తులు కూడా వస్తాయి.అందుకే మనీ ప్లాంట్ ను ఇంట్లో కాకుండా ఇంటి బయట పెంచుకోవచ్చు.అదేవిధంగా ఇంట్లోకి కప్పలు( frogs ) రాకూడదు.
అలా వస్తే ఇంట్లో ఉండే వారికి కష్టాలు తప్పవట.అంతేకాకుండా తలకు పైన వేలాయుధంతో కూడిన కుమారస్వామి బొమ్మ కూడా అస్సలు ఇంట్లో ఉండకూడదు.
అలాగే ఇంట్లో అడుగు కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న దేవత విగ్రహాలను కూడా ఉంచుకోకూడదు.