చైనా, తైవాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.వరుసగా మూడో రోజు చైనా మిలటరీ డ్రిల్స్ నిర్వహిస్తుంది.
షెడ్యూల్ ప్రకారం నేటితో విన్యాసాలు ముగియాల్సి ఉంది.సరిహద్దు ప్రాంతంలో యుద్ధ నౌకలతో పాటు విమానాలు భారీగా మోహరించాయి.
అయితే తైవాన్ పై దాడికి డ్రాగన్ కంట్రీ సన్నాహాలు చేస్తోందనే అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.ఈ క్రమంలో చైనా విన్యాపాలపై అమెరికా ఆందోళన చెందుతున్నట్లు కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో సరిహద్దుల్లో యథాతథస్థితి కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తుందని సమాచారం.అయితే తైవాన్ ఆక్రమణకు దిగితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరిస్తుంది చైనా.
గత వారంలో అమెరికాలో పర్యటించిన తైవాన్ అధ్యక్షురాలు తమది స్వయంపాలిత ప్రజాస్వామ్య దేశమని తెలిపారు.తైవాన్ అధ్యక్షురాలి పర్యటనతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న చైనా యుద్ధ సన్నాహాలు చేస్తోందని తెలుస్తోంది.