దృశ్యంలో మీనా పాత్రను ఆ స్టార్ హీరోయిన్ రిజెక్ట్ చేసిందా.. అసలేం జరిగిందంటే?

టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్,( Venkatesh ) సీనియర్ హీరోయిన్ మీనా( Meena ) చాలా సినిమాలలో జంటగా నటించిన విషయం తెలిసిందే.గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి.

 Know Seniour Actress Shobhana First Choice For Mohan Lal Drishyam Movie Before M-TeluguStop.com

అయితే చాలా కాలం తర్వాత వీరిద్దరి కాంబోలో వచ్చిన సినిమా దృశ్యం.( Drishyam Movie ) ఈ సినిమా విడుదల అయ్యి ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.

కూతురు భవిష్యత్తు కోసం ఒక కన్న తండ్రి పడే ఆవేదన తపన, పోరాటమే ఈ చిత్రం.ఈ సినిమా మలయాళం మూవీకి రీమేక్ అన్న విషయం మనందరికీ తెలిసిందే.

మలయాళ నటుడు మోహన్ లాల్( Mohan Lal ) నటించిన సూపర్ హిట్ సినిమాను తెలుగులో రీమేక్ చేశారు.

Telugu Drishyam, Meena, Mohan Lal, Tollywood, Venkatesh, Venkateshmeena-Movie

అయితే మోహన్ లాల్ మలయాళం లో హీరోగా నటించగా అక్కడ భార్యగా మీనా నటించిన విషయం తెలిసిందే.తెలుగులో కూడా మీనానే నటించింది.ఇకపోతే మొదట ఈ పాత్రకు మీనాని అనుకోలేదట.

మీనా కంటే ముందుగా ఈ పాత్ర కోసం సీనియర్ నటి శోభనను( Senior Actress Shobhana ) అనుకున్నారట.అయితే ఆ సినిమాను ఆమె తిరస్కరించిందట.అందుకు గల కారణాన్ని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టింది శోభన.ఆ సమయంలో తాను వినీత్ శ్రీనివాసన్ సినిమాలో నటిస్తున్నానని అందుకే దృశ్యం సినిమాను రిజెక్ట్ చేసినట్లు తెలిపింది శోభన.

Telugu Drishyam, Meena, Mohan Lal, Tollywood, Venkatesh, Venkateshmeena-Movie

ఈ విషయం ఇప్పుడే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.ఇకపోతే వెంకటేష్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తుండగా మరోవైపు మీనా అడపాదడపా సినిమాలలో నటిస్తున్న విషయం తెలిసిందే.ఇక వెంకీ మామ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఈ సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 14వ తేదీన విడుదల కానుంది.ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు వెంకటేష్.

ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube