అమృతంలో ఆ డైలాగ్స్ వల్ల జైలులో వేస్తామన్నారు.. హర్షవర్ధన్ సంచలన వ్యాఖ్యలు!

అమృతం సీరియల్.( Amrutham Serial ) చాలామందికి ఈ సీరియల్ గురించి అంతగా తెలియకపోవచ్చు.

 Harsha Vardhan Recalls His Memories With Amrutham Serial Shares A Shocking Incid-TeluguStop.com

ముఖ్యంగా ఈ జనరేషన్ వారికి ఈ సీరియల్ గురించి అంతగా తెలియదు.కానీ 90s వాళ్లకి మాత్రం ఈ సీరియల్ ఎప్పటికీ మరిచిపోలేని ఒక మధురానుభూతి అని చెప్పాలి.

ఆదివారం రోజు రాత్రి 8:30 గంటలు అయితే చాలు ఇంటిల్లి పాది మొత్తం జెమినీ టీవీ పెట్టుకుని ఈ సీరియల్ కోసం ఎంతో గాను ఎదురు చూసేవారు.ఈ సీరియల్ ఒరేయ్ ఆంజినేలు తెగ ఆయాస పడిపోకు చాలు.

మనం ఈదుతున్నాం ఒక చెంచాడు భవసాగరాలు అంటూ సాగే టైటిల్ సాంగ్ కూడా భలే ఉండేది.ఇక ఈ సీరియల్‌ లో టైటిల్ రోల్ అయిన అమృత రావుగా మొదట్లో శివాజీ రాజా నటించగా ఆ తర్వాత నరేష్ యాక్ట్ చేశారు.

కొన్నాళ్లకి అదే పాత్రను హర్ష వర్ధన్( Harsha Vardhan ) చేశారు.సీరియల్స్ నుంచి ఎన్నో సినిమాల్లో నటుడిగా, రచయితగా కూడా పని చేశారు హర్షవర్ధన్.

Telugu Amrutham Serial, Amruthamserial, Harsha Vardhan, Shivaji Raja, Tollywood-

ఇక తాజాగా ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అమృతం సీరియల్ విశేషాలు చెబుతూ ఒక షాకింగ్ విషయం చెప్పారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.ఒక కులాన్ని తిడుతూ ఫేమస్ డైరెక్టర్ 20 సినిమాల్లో ఆ డైలాగ్ వాడితే అది నేను కూడా అమృతం సీరియల్‌ లో తెలియక ఒక దగ్గర వాడేశాను.ఆడియన్స్‌కి తెలియడం కోసం మాత్రమే ఈ మాట అంటున్నాను.

చాలా మంది ఉప్పర్ మీటింగ్ ఏంట్రా అంటారు.అయితే ఉప్పర అనేది ఒక జాతి, తెగ, కులం అది.దాని మీద జోకులేస్తే అట్రాసిటీ కేసు కింద మూసేయచ్చు.అలాగే అప్పట్లో నేను రాసిన మరో డైలాగ్ పింజారి వెధవ.

ఇది జంధ్యాల గారి చాలా సినిమాల్లో ఉండేది.నేను కూడా బావుంది కదా సౌండ్ అని పెట్టేశాను.

అది చూసి ఒక ప్రెస్ రిపోర్టర్ నాకు కాల్ చేశారు.నిన్ను ఇప్పటికిప్పుడు లోపలోస్తే నీ పరిస్థితేంటి అన్నట్లు మాట్లాడాడు.

Telugu Amrutham Serial, Amruthamserial, Harsha Vardhan, Shivaji Raja, Tollywood-

అంటే గంగరాజు గారి మీదున్న గౌరవం, అమృతం మీదున్న గౌరవం అలానే నా మీద ఉన్న మంచి అభిప్రాయంతో నాకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పారు.ఎందుకు సార్ మీరు కూడా అలాంటి దిగజారుడు డైలాగురు రాస్తారు అంటే నేను షాకైపోయాను.సార్ అదేంటండి ఫలానా పెద్ద డైరెక్టర్ కూడా సినిమాల్లో వాడారు కదా అన్నా.మీరు చెబుతున్న డైరెక్టర్ ఈ విషయంపై ఎన్నిసార్లు కోర్టు కెళ్లారో తెలుసా అని కొశ్చన్ చేశారు.

నిజంగా నాకు తెలీదండి అన్నాను.కానీ అది కరెక్ట్ కాదు కదా.నీకు తెలీకుండా చేసినా తప్పు తప్పే.చట్టం గురించి అందరికీ తెలియాల్సిందే.

నన్నేదో జైల్లో వేస్తారని కాదు నా బాధ అక్కడ, నేను ఒకరిని కించ పరిచేలా అలా రాస్తానా, ప్రతి ఒక్కరికీ గౌరవం ఇచ్చి మాట్లాడే వ్యక్తిని నేను అదేదో మంచిపేరు కోసం కాదు.నాకు అదే కంఫర్ట్.

నా దగ్గరున్న వాళ్లకి నేనేంటో తెలుసు.కానీ ఒక జర్నలిస్ట్ నన్ను ఎక్కడి నుంచో ఫోన్ చేసి ఈ మాట అనగానే నాకు బాధ వేసింది.

ఆయన నా మంచికే చెప్పారు.మీకు కుదిరితే డిలీట్ చేసేయండి సార్,మీరంటే గౌరవం నాకు, అంత దిగజారక్కర్లేదు మీరు కొంచెం ఒళ్లు దగ్గరపెట్టుకొని రాయండి అన్నారు.

నేను వెంటనే ఆ డైలాగులు డిలీట్ చేయించాను.ఇలా మనకి తెలీకుండా చాలా పదాలు వాడేస్తాము.

ఎవరో వాడారు కదా అని మనం గుడ్డీగా ఫాలో అయిపోతుంటాము.కానీ అది తప్పని తెలిసినప్పుడు చెప్పాలి కదా అనే ఉద్దేశంతోనే ఇప్పుడు షేర్ చేస్తున్నాను అని హర్షవర్ధన్ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube