తమ ముఖ చర్మాన్ని తెల్లగా కాంతివంతంగా మరియు అందంగా మెరిపించుకోవాలని మగువలు తహతహలాడుతుంటారు.ఈ క్రమంలోనే ఖరీదైన స్కిన్ వైట్నింగ్ క్రీమ్స్ ( Skin whitening creams )ను కొనుగోలు చేసి వాడుతుంటారు.
కానీ ఎండు ద్రాక్షను ఇప్పుడు చెప్పబోయే విధంగా ఉపయోగిస్తే క్రీమ్స్ అవసరమే ఉండదు.ఆరోగ్య పరంగా ఎండు ద్రాక్ష ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తుంది.
వివిధ రకాల జబ్బులకు అడ్డుకట్ట వేస్తుంది.అలాగే ఎండు ద్రాక్షలో బ్యూటీ సీక్రెట్స్ కూడా దాగి ఉన్నాయి.

ముఖ్యంగా చర్మం ఛాయను మెరుగుపరచడానికి ఎండు ద్రాక్ష చాలా ఉత్తమంగా సహాయపడుతుంది.అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఎనిమిది నుంచి పది ఎండు ద్రాక్ష ( Raisins )వేసుకోవాలి.అలాగే చిటికెడు కుంకుమ పువ్వు( Saffron flower ), పావు కప్పు కాచి చల్లార్చిన పాలు( milk ) వేసుకుని బాగా కలిపి మూత పెట్టి నైట్ అంతా వదిలేయాలి.మరుసటి రోజు మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టుకున్న ఎండు ద్రాక్ష మరియు కుంకుమపువ్వును పాలతో సహా వేసి స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రౌండ్ చేసుకున్న మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ ఓట్స్ పౌడర్ ( Oats powder )వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆ తర్వాత వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.నిత్యం ఈ సింపుల్ రెమెడీని కనుక పాటించారంటే మీ స్కిన్ కలర్ అనేది క్రమ క్రమంగా ఇంప్రూవ్ అవుతుంది.
ముఖ చర్మం తెల్లగా కాంతివంతంగా మారుతుంది.ఎండు ద్రాక్ష, కుంకుమపువ్వు చర్మ ఛాయను పెంచడానికి అద్భుతంగా తోడ్పడతాయి.
మొండి మచ్చలను మటుమాయం చేస్తాయి.పాలు మరియు ఓట్స్ కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడానికి, స్కిన్ ను సాఫ్ట్ చేయడానికి, డెడ్ స్కిన్ సెల్స్ ను వదిలించడానికి తోడ్పడతాయి.
అదే సమయంలో చర్మ ఆరోగ్యాన్ని సైతం పెంచుతాయి.







