1.చంద్రబాబును కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ నేతలు
విశాఖ ఎయిర్ పోర్ట్ లో ఉక్కు పరిరక్షణ సమితి నేతలు కలిశారు.విశాఖ ఉద్యమానికి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు.
2.ఏయూ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్
విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్ 2023 నోటిఫికేషన్ విడుదల చేసింది.దీని ద్వారా బీటెక్ – ఎంటెక్ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రాం లో ప్రవేశాలు కల్పిస్తారు.
3.పోలవరంపై దేవినేని ఉమా కామెంట్స్
పోలవరం ప్రాజెక్టు కోసం ఎంతోమంది భూములు త్యాగం చేశారని , పోలవరం నిర్వాసితులను ఆదుకునేది చంద్రబాబునాయుడే అని టిడిపి మాజీ మంత్రి బొండా ఉమా అన్నారు.
4.జనసేన పొత్తుపై సోము వీర్రాజు కామెంట్
జనసేన బిజెపి పొత్తుపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.రాజకీయ అవసరాల కోసం సహజంగా అనేక పార్టీల నేతలను కలుస్తాము అని, అలా కలిసిన వారందరితోనూ పొత్తు కాదు అంటూ జనసేన ను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.
5.బిజెపిపై మంత్రి ప్రశాంత్ రెడ్డి కామెంట్స్
బిజెపి నేతలు పదో తరగతి పేపర్లను లీక్ చేసి మళ్లీ వారే ధర్నాలు , రాస్తారోకోలు చేస్తున్నారని తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి విమర్శించారు.
6.మా ఇంటికి కూడా పోలీసులు వచ్చారు : ఎంపీ అరవింద్
తెలంగాణలో ఎమర్జెన్సీ వాతావరణం నెలకొందని అందరినీ అరెస్టులు చేస్తున్నారని, హైదరాబాదులో తను ఇంటికి కూడా పోలీసులు వచ్చారని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు.
7.పవన్ కళ్యాణ్ పై ఏపీ మంత్రి కామెంట్స్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యభిచారం చేస్తున్నారని ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ విమర్శించారు.
8.వైసిపి ప్రభుత్వం పై అచ్చన్న కామెంట్స్
ఏపీలో జగన్ పార్టీ అధికారంలో ఉండేది ఇక ఎనిమిది మాసాలే అని ఏపీ టిడిపి అధ్యక్షుడు అచ్చెన్న నాయుడు అన్నారు.
9.వైసీపీ ఎమ్మెల్యేలపై విమర్శలు
వైసీపీ ఎమ్మెల్యేలపై టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి విమర్శలు చేశారు.ఎమ్మెల్యేలకు టైం అయిపోయిందని , ఇంటికి వెళ్లడానికి సిద్ధంగా ఉండాలంటే ఆయన సెటైర్లు వేశారు.
10.ప్రధాని పై కేటీఆర్ కామెంట్స్
ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ మంత్రి కేటీఆర్ విమర్శలు చేశారు.ఉప్పు, పప్పు, పెట్రోల్ , డీజిల్, గ్యాస్ ధరలు పెరిగిన నేపథ్యంలో పిరమైన ప్రధాని అంటూ కేటీఆర్ కామెంట్ చేశారు.
11.బండి అరెస్టుపై కిషన్ రెడ్డి కామెంట్స్
తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు.కారణాలు చూపకుండా ఎలా అరెస్టు చేస్తారు అంటూ ప్రశ్నించారు.
12.సిసోడియా జుడిషియల్ కస్టడీ పొడిగింపు
ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనిషి ఏప్రిల్ 17 వరకు పొడిగించింది.
13. రాహుల్ గాంధీ పై విమర్శలు
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పై కేంద్ర విమానాయన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య తీవ్ర విమర్శలు చేశారు.
14.నాదెండ్ల మనోహర్ విమర్శలు
పోలవరం ప్రాజెక్టుపై జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శలు చేశారు.జగనన్న పాపాల పథకం పోలవరం ప్రాజెక్టు అని మనోహర్ విమర్శించారు.
15.పేపర్ లీకేజీ పై మంత్రి కామెంట్స్
టెన్త్ పేపర్ లీకేజీ కుట్రలో ఎంత వారైనా వదిలిపెట్టి ప్రజాశక్తి లేదని తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
16.చంద్రబాబుకు ఇదే చివరి ఎన్నికలు
టిడిపి అధినేత చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలని ఏపీ మంత్రి గుమ్మనూరు జయరాం విమర్శించారు.
17.టెన్త్ పేపర్ లీకేజీలో బండి సంజయ్ హస్తం
పదో తరగతి పేపర్ లీక్ వ్యవహారంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ హస్తం ఉందని బిఆర్ఎస్ నేతలు విమర్శించారు.
18.కేదార్నాథ్ యాత్ర
ఈ నెల 25న కేదార్నాథ్ దాం యాత్ర ప్రారంభం కానుంది.
19.దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి నాలుగు రోజులు బంద్
హైదరాబాద్ నగరంలోని దుర్గం చెరువు పై ఉన్న తీగల వంతెన పైనుంచి వాహనాల రాకపోకలపై ట్రాఫిక్ పోలీసులు కాంక్షలు విధించారు ఆరవ తేదీ అర్ధరాత్రి నుంచి 10వ తేదీ ఉదయం 6 గంటల వరకు మూడు రోజులు పాటు వంతెన పై వాహనాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.
20.కెసిఆర్ కు భట్టి విక్రమార్క లేఖ
తెలంగాణ సీఎం కేసీఆర్ కు సీఎల్పీ నేత బట్టి విక్రమార్క సింగరేణి పై బహిరంగ లేఖ రాశారు.