ఆరోగ్యంగా ఉండాలంటే బాడీపైనే కాదు లోన కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి.లేదంటే మలినాలు పేరుకుపోతూ ఉంటాయి.
అలా పేరుకుపోయే కొద్ది వివిధ రకాల జబ్బులు వచ్చేస్తాయి.ఈ నేపథ్యంలోనే వర్షాకాలంలో బాడీని డిటాక్స్ చేసే సూపర్ డ్రింక్ ఒకటి ఉంది.
మరి ఆ సూపర్ డ్రింక్ ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? అసలు దాన్ని తాగడం వల్ల వచ్చే ఆరోగ్య లాభాలు ఏంటి.? వంటి విషయాలను ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నెను పెట్టుకుని ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోయాలి.వాటర్ కాస్త హీట్ అవ్వగానే అందులో హాఫ్ టేబుల్ స్పూన్ వాము పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ సోంపు పొడి, రెండు పచ్చి పసుపు కొమ్ముల స్లైసెస్, పావు స్పూన్ జాజికాయ పౌడర్, పావు స్పూన్ మిరియాల పౌడర్ వేసుకుని పది నిమిషాల పాటు చిన్న మంటపై మరిగించాలి.
ఆ తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ బెల్లం తురుము వేసి మరో మూడు లేదు నాలుగు నిమిషాల పాటు మరిగించాలి.ఆపై స్టవ్ ఆఫ్ చేసి స్ట్రైనర్ సాయంతో వాటర్‌ను ఫిల్టర్ చేసుకుంటే మాన్ సూన్ డిటాక్స్ డ్రింక్ సిద్ధం అవుతుంది.
ప్రస్తుత ఈ వర్షాకాలంలో ప్రతి రోజు ఉదయాన్నే ఈ సూపర్ టేస్టీ డ్రింక్‌ను తీసుకుంటే బాడీలో పేరుకుపోయిన వ్యర్థాలు, విషాలు తొలగిపోయి శుభ్రంగా మారుతుంది.
అంతేకాదు, ఈ డిటాక్స్ డ్రింక్‌ను డైట్‌లో చేర్చుకోవడం వల్ల వెయిట్ లాస్ అవుతారు.ఇమ్యూనిటీ సిస్టమ్ బూస్ట్ అవుతుంది.జీర్ణ వ్యవస్థ పని తీరు చురుగ్గా మారుతుంది.
గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యలు దరి చేరకుండా ఉంటాయి.మరియు జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధులకు దూరంగా కూడా ఉండొచ్చు.
కాబట్టి, ఈ డిటాక్స్ డ్రింక్‌ను తప్పకుండా తీసుకునేందుకు ట్రై చేయండి.