కరోనా వైరస్ రాక ముందు శానిటైజర్ అంటే ఏంటో కూడా చాలా మందికి తెలియదు.అప్పుడు శానిటైజర్ వినియోగం కూడా చాలా తక్కువ.
కానీ, ఎప్పుడైతే కరోనా భూతం దాపరించిందో.అప్పటి నుంచి చిన్న,పెద్ద, ఉన్నోడు, లేనోడు అనే తేడా లేకుండా అందరూ శానిటైజర్ వాడుతున్నారు.
బయటకు వెళ్లే ప్రతి ఒక్కరు తమ వెంట పర్స్, మొబైల్‌తో పాటు శానిటైజర్‌ను కూడా పట్టుకుపోతున్నారు.ఇక ఏదైనా పని చేయడానికి ముందు.
ఆ తర్వాత కూడా చేతులను శానిటైజర్‌తో క్లీన్ చేసుకుంటున్నారు.
గత సంవత్సర కాలంగా శానిటైజర్‌ను వాడుతూ వాడుతూ ఉండటం వల్ల చాలా మంది చేతులు రాఫ్‌గా మారిపోయాయి.
దీంతో చేతులను మృదువుగా మార్చుకునేందుకు ఏవేవో ప్రయోగాలు చేస్తున్నారు.అయితే ఇప్పుడు చెప్పబోయే టిప్స్ పాటిస్తే.
సులువుగా చేతులను స్మూత్‌గా మార్చుకోవచ్చు.చేతులను మృదువుగా మార్చడంతో ఓట్స్ గ్రేట్ గా సహాయపడతాయి.
ఓట్స్ పౌడర్‌లో కొబ్బరి నూనె కలిపి చేతులకు అప్లై చేయాలి.అర గంట పాటు ఆరనిచ్చి.
అనంతరం మెల్ల మెల్లగా రూద్దుతూ చేతులను క్లీన్ చేసుకోవాలి.ఇలా రెగ్యులర్‌గా చేస్తే.
క్రమంగా చేతులు స్మూత్‌గా మారతాయి.
అలాగే బంగాళ దుంపలను ఉడికించి మెత్తగా పేస్ట్‌గా చేసుకోవాలి.ఆ పేస్ట్‌లో కొద్దిగా బాదం ఆయిల్ మరియు గ్లిజరిన్ కలిపి చేతులకు అప్లై చేయాలి.బాగా డ్రై అయిన తర్వాత కూల్ వాటర్‌తో చేతులను శుభ్రం చేసుకోవాలి.
ఇలా ప్రతి రోజు చేస్తే.చేతులు కోమలంగా మారతాయి.
ఇక ఒక బౌల్‌లో ఎగ్ వైట్, ఆలివ్ నూనె మరియు నిమ్మ రసం వేసి బాగా మిక్స్ చేసి.చేతులకు పట్టించాలి.
ఆర గంట పాటు వదిలిస్తే.డ్రై అయిపోతుంది.
అనంతరం వాటర్‌తో చేతులను క్లీన్ చేసుకోవాలి.ఇలా చేసినా చేతులు స్మూత్‌గా మరియు అందంగా మారతాయి.