1. భువనేశ్వరి సత్యాగ్రహ దీక్ష
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా నారా భువనేశ్వరి నిరాహారదీక్ష చేస్తున్నారు.ఈ దీక్షకు సత్యమేవ జయతే అనే పేరును పెట్టారు.
2.పవన్ కళ్యాణ్ కు అంబటి ప్రశ్న
అయ్యా పవన్ కళ్యాణ్ ఇప్పుడు బిజెపితో మీరు ఉన్నట్టా లేనట్టా అని ఏపీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు.
3.ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు కామెంట్స్
కాంగ్రెస్ అధికారంలోకి రావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగు రుద్దరాజు అన్నారు.
4.పవన్ కళ్యాణ్ కామెంట్స్
గ్రామ స్వరాజ్యాన్ని రాష్ట్రంలో పూర్తిగా చంపేశారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు.
5.చంద్రబాబుపై మంత్రి రోజా విమర్శలు
గాడ్సే కంటే ఘోరమైన వ్యక్తి చంద్రబాబు అని ఏపీ మంత్రి ఆర్కే రోజా విమర్శించారు.
6.నిజామాబాద్ కు ప్రధాని మోదీ
భారత ప్రధాని నరేంద్ర మోడీ రేపు నిజామాబాద్ కు వస్తున్నారని , నిజామాబాద్ బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారు.
7.రేపు తెలంగాణకు సిఈసి
తెలంగాణ ఎన్నికల ఏర్పాట్లు పరిశీలించేందుకు భారత ఎన్నికల సంఘం అధికారులు తెలంగాణకు రానున్నారు.
8.తిరుమల బ్రహ్మోత్సవాలు
ఈనెల 15 నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి టిటిడి అధికారులు ఏర్పాటు చేశారు.
9.నేడు దళిత బంధు రెండో విడత
గాంధీ జయంతి రోజున దళిత బంధు రెండో విడత కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు.
10.ఏపీ తెలంగాణలో ఎన్.ఐ ఏ సోదాలు
తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ అధికారులు సాదాలు చేస్తున్నారు.హైదరాబాద్ తో పాటు ఆంధ్రప్రదేశ్ లో ఆరు చోట్ల సాధాలు నిర్వహిస్తున్నారు.
11.మచిలీపట్నంలో పవన్ వారాహి యాత్ర
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర నేడు మచిలీపట్నంలో కొనసాగుతోంది.
12.చంద్రబాబు సత్యాగ్రహ దీక్ష
టిడిపి అధినేత చంద్రబాబు జైలులో సత్యాగ్రహ దీక్ష చేపట్టారు.
13.ప్రధానిపై కేటీఆర్ విమర్శలు
నమో అంటే నమ్మించి మోసం చేయడం అని తెలంగాణ ప్రజలకు తెలుసు అని ప్రధానమంత్రి నరేంద్ర మోది పై కేటీఆర్ విమర్శలు చేశారు.
14.చంద్రబాబుపై మురళీమోహన్ కామెంట్స్
హైదరాబాద్ లో ఐటీ రంగాన్ని ప్రవేశపెట్టిన ఘనత చంద్రబాబుదేనిని , సినీ నటుడు, టిడిపి సీనియర్ నేత మురళీమోహన్ అన్నారు.
15.ప్రధాని సభ పై రేవంత్ రెడ్డి విమర్శలు
పాలమూరులో బ్రదర్ నరేంద్ర మోడీ పర్యటనపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు తెలంగాణ పట్ల మోది వివక్ష చూపిస్తున్నారని, నరేంద్ర మోది కేవలం గుజరాత్ కు మాత్రమే ప్రధానమంత్రి అని రేవంత్ ప్రశ్నించారు.
16.ఢిల్లీకి కిషన్ రెడ్డి
కేంద్రమంత్రి తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆకస్మాత్తుగా ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.
17.మాజీ మంత్రి నారాయణ కు నోటీసులు
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టిడిపి మాజీ మంత్రి పొంగులేటి నారాయణ కు సిఐడి అధికారులు నోటీసులు జారీ చేశారు.నాలుగో తేదీన విచారణకు హాజరు కావలసిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు.
18.ఢిల్లీలో లోకేష్ నిరాహారదీక్ష ప్రారంభం
స్కిల్ డెవలప్మెంట్ కేసులో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా ఢిల్లీలో నారా లోకేష్ ఒకరోజు దీక్ష చేపట్టారు.
19.ములుగులో మావోలకు వ్యతిరేకంగా పోస్టర్లు
ములుగు జిల్లాలో మావోయిస్టులకు వ్యతిరేకంగా వెలిసిన కరపత్రాలు కలకలం రేపుతున్నాయి.వెంకటాపురం మండలంలోని వీరభద్రవరం పాలెం పాత్రాపురం గ్రామ శివారులలో మావోయిస్టులకు వ్యతిరేకంగా ఆదివాసి గిరిజన సంఘాల ఐక్యవేదిక పేరుతో కరపత్రాలు వెలిశాయి.
20.దసరాకు ప్రత్యేక బస్సులు.
దసరా పండుగ సందర్భంగా సంస్థలు వెళ్లేందుకు హైదరాబాదు నుంచి 5265 ప్రత్యేక బస్సులను నడిపేందుకు టీఎస్ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది.