ఆంధ్ర ( Andhra )పేరు చెబితే ఎవరికైనా గుర్తొచ్చేవి ఏంటి గోదారి అందాలు, అక్కడి మర్యాదలు, నోరూరించే వంటలు.శ్రీకాకుళం జిల్లాల పేర్లు చెబుతే వినిపించేది వెటకారం ఇక రాయలసీమ విషయానికి వస్తే అక్కడి గొడ్డుకారం, ఫ్యాక్షన్ కథలు ఇంటింటా ఉంటాయి.
ఇక తెలంగాణ ( Telangana )విషయానికొస్తే ప్రతి ఒక్కరికి ముందుగా గుర్తిండాల్సినవి ఏంటి? తెలంగాణ కోసం సాయుధ పోరాటం చేసిన పోరాట కథలు గుర్తు రావాలి లేదా ఆంధ్ర పెత్తనం కింద నలిగిపోయిన సామాన్యుల జీవితాలు గుర్తు రావాలి కానీ ఇప్పుడు వస్తున్న సినిమాలు తెలంగాణను ఒక తాగుబోతులు ఉన్న ఒక రాష్ట్రంగా చూపించాల్సిన గత్యంతరం ఎందుకు వచ్చింది.నిన్న మొన్న వచ్చిన బలగం దసరా ( balagam , dasara )సినిమాలనే తీసుకుందాం ఈ రెండు సినిమాల్లో 90 శాతం కథ తాగుబోతులు, మద్యం చుట్టే తిరుగుతూ ఉంటుంది.
సినిమాల్లో కూడా తెలంగాణ అంటే పూర్తిస్థాయిలో మద్యం అనే విషయాన్ని మన తెలంగాణ దర్శకులే చూపించడం అత్యంత దౌర్భాగ్యం.
మిగతా సినిమాల విషయానికొస్తే సినిమాలో ఎవరైనా తాగుబోతు పాత్ర పెట్టాలంటే తెలంగాణ భాషలో మాట్లాడుతున్న పాత్రలనే ఉపయోగిస్తూ ఉంటారు లేదా క్యారెక్టర్ ఆర్టిస్టులకి, నెగటివ్ పాత్రలకు తెలంగాణ యాస పెట్టి ఇన్నాళ్లపాటు తెలంగాణ అని చిన్న చూపు చూశారు.లేదా ఏదైనా పోలీస్ ఆఫీసర్ నోట్లోకి కిల్లి వేసుకొని షర్ట్ బటన్స్ విప్పి తెలంగాణ భాషలో తిడుతూ ఉంటాయి.ఆది నుంచి ఇదే జరుగుతుంది ఈ మధ్యకాలంలో తెలంగాణ భాషలో సినిమాలు తీస్తూ కాసుల వర్షం కురిపించుకుంటున్న నేపథ్యంలో తెలంగాణ వారే తెలంగాణలో చిన్న చూపు చూడటం అనేది నిజంగా ఒప్పుకోవాల్సిన విషయం కాదు.
దసరా సినిమాలో ముసలి పాత్ర నుంచి చిన్న పిల్లవాడు ప్రతి ఒక్కరూ మద్యం తాగుతూనే కనిపిస్తారు. హీరో పాత్ర ఎలివేషన్ పూర్తిగా తాగుతున్న విధంగా తీశాడు.
దసరా మూవీ పోస్టర్స్ లో కూడా ఇదే కనిపించింది.
ఇంతకన్నా అవమానం మరొకటి ఉంటుందా.ఇప్పటికైనా కళ్ళు తెరవండి ప్రతి ఒక్క తెలంగాణ వ్యక్తి ఇలాంటి సినిమాలను బ్యాన్ చేయాలి.తెలంగాణ అంటే మద్యం ఏరులై పారడం కాదు సాంప్రదాయాలను గౌరవించడం నాటి నుంచి మన పెద్దలు చూపించిన బాటలో నడవడం అంతేకానీ మద్యం కోసమే బ్రతుకుతున్నట్టుగా, బలం కోసం లేదా ధైర్యం రావడం కోసం మద్యం తాగుతున్నట్టుగా చూపించడం సబబు కాదు తెలంగాణ దర్శకులు ఈ రకంగా చూపించి మనల్ని మనం అవమానించుకోవడమే కాకుండా మిగతా వారి ముందు కూడా చిన్న చూపు చూపు చూసేలా చేయడం ఎంత వరకు న్యాయం అనేది మిమ్మల్ని మీరు విమర్శించుకోండి.
ఈరోజు సినిమా గెలిచింది డబ్బులు వచ్చాయి కాబట్టి మీరు ఏది చేసినా అన్న నడుస్తుంది అనుకుంటే తప్పు.తెలంగాణ అంటే ఏంటో మీకు నిజంగా తెలిస్తే ఇలాంటి సినిమాలు తీసి తెలంగాణ వారిని అవమానించారు.