దాసరి ఎంతో మందికి లైఫ్ ఇచ్చాడు.. ఇప్పుడు ఏ ఒక్కరూ పట్టించుకోవట్లేదు?

దర్శకుడు అనే పదానికి అసలు సిసలైన ఉదాహరణ ఎవరు అంటే తెలుగు ప్రేక్షకులందరూ చెప్పే పేరు దాసరి నారాయణరావు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఆయన సినిమాలతో దర్శకుల అందరిలో ఒక రత్నంగా.దర్శకరత్న గా పేరు సంపాదించుకున్నారు.ఇటీవలి కాలంలో దర్శకులు ఏదైనా సినిమా తీస్తే ఒక్క హిట్ కొట్టిన తర్వాత మరో సినిమా హిట్ట్ అవుతుందో లేదో కూడా తెలియని పరిస్థితి.

 Why No One Is Talking About Dasari , Telugu Film Industry , Dasari , Talking About Dasari , Dasari Narayana Rao , Producer , Dasari Jayanti-TeluguStop.com

కానీ అప్పట్లో ఏకంగా వరుసగా 12 హిట్లు అందించిన ఏకైక దర్శకుడు దాసరి నారాయణరావు.కేవలం దర్శకుడిగానే మాత్రమే కాకుండా నటుడిగా నిర్మాతగా కూడా ఈయన ప్రేక్షకులందరికీ ఎంతగానో దగ్గరయ్యారు.

అంతేకాదు తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలుగా కొనసాగిన ఎంతోమంది దర్శకరత్న దాసరి నారాయణరావు ఛాన్స్ ఇస్తేనే హీరోలుగా మారినవారు చాలామంది ఉన్నారు.కేవలం ఒక దర్శకుడిగా మాత్రమే కాకుండా ఇండస్ట్రీ పెద్దగా తెలుగు చిత్ర పరిశ్రమ బాధ్యతలను భుజాన వేసుకొనీ ఎవరికి ఏ సమస్య వచ్చినా నేనున్నాను అంటూ ఎప్పుడూ ముందుండే వారు ఆయన.అందుకే దాసరి నారాయణరావు భౌతికంగా మనకు దూరమైనప్పటికీ ఇప్పటికీ ఆయన గొప్పతనం గురించి ఎంతో మంది సినీ ప్రముఖులు చెబుతూనే ఉంటారు.

 Why No One Is Talking About Dasari , Telugu Film Industry , Dasari , Talking About Dasari , Dasari Narayana Rao , Producer , Dasari Jayanti-దాసరి ఎంతో మందికి లైఫ్ ఇచ్చాడు.. ఇప్పుడు ఏ ఒక్కరూ పట్టించుకోవట్లేదు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Dasari, Dasari Jayanti, Dasari Yana Rao, Telugu-Telugu Stop Exclusive Top Stories

ఇక చిత్రపరిశ్రమకు ఎవరో తెలియని ఏకంగా 50 మంది అనామకులకు నటీనటులుగా జన్మనిచ్చి కొత్త జీవితాన్ని ప్రసాదించారూ దాసరి.ఇక 80 మంది సినీ సాంకేతిక వర్గానికి కూడా అవకాశం ఇచ్చి జీవనోపాధిని కల్పించాడు.అయితే గతంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ గర్వంగా దాసరి జయంతి ని ప్రకటించింది.

కానీ నేడు దాసరి వర్ధంతిని మాత్రం పూర్తిగా సినీ ప్రముఖులు అందరు మరిచిపోయారు.ఆయన దర్శకత్వంలో చిత్ర పరిశ్రమకు పరిచయమైన వారు సైతం ఇక ఆయన వర్ధంతి గురించి గుర్తు పెట్టుకో లేక పోయారు అని చెప్పాలి.

అయితే ఎవరు మర్చిపోయినా దాసరి నారాయణరావు మాత్రం ఎప్పటికీ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సజీవంగానే వుంటారు అన్నది అక్షర సత్యం అని చెప్పాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube