1.మాగుంట రాఘవ జ్యుడీషియల్ కస్టడీ పొడగింపు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డి జ్యూడిషియల్ కస్టడి ని హౌస్ అవెన్యూ సిబిఐ కోర్టు 14 రోజులు పొడిగించింది.
2.విజయవాడలో అహింసా రన్
ఏప్రిల్ 2న విజయవాడలో అహింసాహారం జరగనుంది.ఈ మేరకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు పోస్టర్ ను ఆవిష్కరించారు.
3.కర్ణాటక మాజీ సీఎం అరెస్ట్
బిజెపి ఎమ్మెల్యే మాధవ విరూపాక్షను అరెస్ట్ చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు భారీ ఎత్తున ఆందోళనకు దిగడంతో ఆ పార్టీ సీనియర్ నేత మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు.
4.తెలంగాణ ఈసెట్ నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి స్టేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2023 నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
5.గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశాలు
తాడేపల్లి లోని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ ఐదో తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
6.కవిత అరెస్ట్ ఖాయం : కోమటిరెడ్డి
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో రేపో మాపో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు అవుతుంది అంటూ బిజెపి నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు
7.టిడిపి నేత పట్టాభికి బెయిల్
గన్నవరం లో జరిగిన ఘటన నేపథ్యంలో అరెస్ట్ అయిన టిడిపి జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ కు కోర్టులో బెయిల్ లభించింది.దీంతో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి పట్టాభి విడుదలయ్యారు.
8.మెరీనా తీరంలో గాంధీ విగ్రహం తొలగింపు
మెట్రో రైలు పనుల కారణంగా చెన్నైలోని మెరీనా సముద్రతీరంలో ఉన్న గాంధీ విగ్రహాన్ని 20 మీటర్ల దూరంకి మార్చారు.
9.నరేంద్ర మోది తో బిల్ గేట్స్
భారతదేశ పర్యటనలో ఉన్న బిల్ గేట్స్ ప్రధాని నరేంద్ర మోది తో భేటీ అయ్యారు.
10.వైసీపీ పై అచ్చెన్న కామెంట్స్
రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో భారీగా దొంగ ఓట్లు వేయించేందుకు ఇప్పటి నుంచే వైసీపీ ప్రభుత్వం సిద్ధమవుతోందని టిడిపి ఏపీ అధ్యక్షుడు ఆరోపించారు.
11.రేవంత్ రెడ్డి కాన్వాయ్ కు ప్రమాదం
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రమాదం తప్పింది.సిరిసిల్ల జిల్లాలో పాదయాత్రలో భాగంగా శ్రీపాద ప్రాజెక్టు సందర్శనకు రేవంత్ బయలుదేరి వెళ్లారు.ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి కాన్వాయ్ లో కార్లు ప్రమాదవశాత్తు వరుసగా డీ కొన్నాయి.
12.లోకేష్ పాదయాత్ర
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువ గళం పాదయాత్ర నేటికి 34 రోజులకు చేరుకుంది.
13.మంగళగిరిలో టిడిపి లీగల్ సెల్ సదస్సు
మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్ లో టిడిపి లీగల్ సెల్ రాష్ట్ర స్థాయి సదస్సు ఈ రోజు ఉదయం ప్రారంభమైంది.
14.ఏపీ అభివృద్ధిపై కిషన్ రెడ్డి కామెంట్స్
కుటుంబ పార్టీల కారణంగానే ఏపీలో అభివృద్ధి కుంటుపడుతోందని కేంద్ర పర్యటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు.
15.జగన్ పై రోజా కామెంట్స్
విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కు ఊహించని స్థాయిలో పెట్టుబడులు రావడం ఆనందంగా ఉందని ఏపీ టూరిజం శాఖ మంత్రి రోజా అన్నారు.ఈ సందర్భంగా జగన్ పై ప్రశంసలు కురిపించారు.
16.నేటి నుంచి 26 వరకు మహిళల క్రికెట్ ప్రీమియర్ లీగ్
నేటి నుంచి 26 వరకు మహిళల క్రికెట్ ప్రీమియర్ లీగ్ జరగనుంది. టోర్నీలో ఐదు జట్లు తలపడనున్నాయి.
17.రాజమండ్రిలో నాదెండ్ల మనోహర్
జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఈ రోజు రాజమండ్రిలో ఆనం రోటరీ హాల్లో జరిగే కార్యక్రమంలో ప్రమాద బీమా చెక్కులను పంపిణీ చేయనున్నారు.
18.విశాఖలో రెండో రోజు గ్లోబల్ సమ్మిట్
విశాఖలో రెండో రోజు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరగనుంది .పలు కీలక ఒప్పందాలు ఈరోజు ఏపీ ప్రభుత్వం చేసుకోనుంది.
19.నేడు పోలవరంలో అంబటి రాంబాబు
ఈరోజు సాయంత్రం పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి ఏపీ మంత్రి అంబటి రాంబాబు చేరుకొనున్నారు.ప్రాజెక్టు పనుల పరిశీలన అనంతరం ఆ ప్రాంతంలో రాత్రి బస చేయనున్నారు.
20.నేడు పోలవరం పై కీలక సమావేశం
నేడు పోలవరం పై కీలక సమావేశం జరగనుంది.పోలవరంలో డ్యాం డిజైనింగ్ రివ్యూ ప్యానెల్ బృందం పర్యటించనుంది.