టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ నటులలో ఒకరైన మంచు మోహన్ బాబు(Manchu Mohan Babu) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఈరోజు మంచు మోహన్ బాబు పుట్టినరోజు కాగా పుట్టినరోజు సందర్భంగా మనోజ్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.
మంచు మోహన్ బాబు, మంచు మనోజ్(Manchu Mohan Babu, Manchu Manoj) మధ్య గ్యాప్ ఉన్నా మనోజ్ మాత్రం తన పోస్ట్ ద్వారా తండ్రిపై ఉన్న ప్రేమను చాటుకున్నారని చెప్పవచ్చు.
మనోజ్ తన పోస్ట్ లో హ్యాపీ బర్త్ డే నాన్న(Happy birthday dad) అని చెబుతూ తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
మనమంతా కలిసి వేడుకలు చేసుకునే ఈరోజు మీ పక్కన ఉండే అవకాశాన్ని కోల్పోయామని చెప్పుకొచ్చారు.మీతో కలిసి ఉండే క్షణాల కోసం ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు.లవ్ యూ అంటూ మంచు మనోజ్ తన పోస్ట్ లో కామెంట్ చేశారు.మనోజ్ చేసిన ఈ పోస్ట్ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

మంచు లక్ష్మి(Manchu Lakshmi) సైతం తన పోస్ట్ లో హ్యాపీ బర్త్ డే నాన్న.మీరు ఆయురారోగ్యాలతో, సంతోషంతో ప్రశాంతంగా జీవించాలని పేర్కొన్నారు.నాన్నకు మంచి జరగాలని ఎప్పుడూ దేవుడిని ప్రార్థిస్తూ ఉంటానని చెప్పుకొచ్చారు.రాబోయే రోజుల్లో మోహన్ బాబు కుటుంబంలో సమస్యలు అన్నీ పరిష్కారం కావాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

మోహన్ బాబు కన్నప్ప(Mohan Babu Kannappa) సినిమాలో కీలక పాత్రలో నటించగా ఆ సినిమా ఏప్రిల్ నెల 25వ తేదీన థియేటర్లలో విడుదలవుతున్న సంగతి తెలిసిందే.కన్నప్ప సినిమా సక్సెస్ సాధించడం మంచు కుటుంబానికి కీలకం కాగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.మంచు విష్ణు (Manchu Vishnu)డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన కన్నప్ప బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందేమో చూడాలి.మంచు మనోజ్ త్వరలో భైరవం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.