ఆ బ్యానర్ లో 50వ సినిమా ఎన్టీఆర్ తోనే.. ప్రముఖ నిర్మాత సంచలన వ్యాఖ్యలు!

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )ఏపీ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.ఈ విషయం అభిమానులకు సంతోషకర వార్తే అయినప్పటికీ సినిమాల విషయం వచ్చేసరికి నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు.

 Naga Vamsi Prefers Jr Ntr Over Pawan Kalyan, Naga Vamsi, Jr Ntr, Tollywood, Paw-TeluguStop.com

ఇంకా పవన్ చేతిలో ఉన్న సినిమాలు ఎప్పుడెప్పుడు పూర్తి చేస్తారో అని నిర్మాతలు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.నిర్మాతలు కోట్లలో అప్పులు తెచ్చి వడ్డీలు కడుతున్నారు.

ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ ఆ సినిమాలను పూర్తి చేసి విడుదల చేయాలని ఆశపడుతుంటే సినిమాల మాత్రం ఇంకా ఆలస్యం అవుతూనే ఉన్నాయి.

Telugu Jr Ntr, Naga Vamsi, Nagavamsi, Pawan Kalyan, Tollywood-Movie

దీంతో ఈ విషయం పట్ల నిర్మాతలు కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది.ఇది ఇలా ఉంటే తాజాగా నిర్మాత నాగ వంశీ( Producer Naga Vamsi ) పవన్ తో తమ సంస్థలో చేసే 50 వ సినిమాపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.మ్యాడ్ స్క్వేర్ ప్రమోషన్స్ లో భాగంగా నిర్మాత నాగవంశీని కుర్ర హీరో సంగీత్ శోభన్ ( Sangeet Shobhan )మీరు పవన్ లేదా ఎన్టీఆర్ ఈ ఇద్దరితో సితార నిర్మాణ సంస్థలో( Sitara Production Company ) 50వ సినిమా తీయాల్సి వస్తే ఎవరిని ఎంచుకుంటారని ప్రశ్న వెయ్యగా దానికి నిర్మాత నాగవంశీ చాలా తెలివిగా సమాధానం ఇచ్చారు.

పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి దేశానికి ఏం చేస్తారని కోరుకోవాలి కానీ, సినిమా చేయాలని కోరుకోకూడదు.

Telugu Jr Ntr, Naga Vamsi, Nagavamsi, Pawan Kalyan, Tollywood-Movie

సితార నిర్మాణ సంస్థ లో 50th సినిమా మాత్రం NTR తోనే అని నాగవంశీ ఫుల్ గా క్లారిటీ ఇచ్చేసారు.మరి అందులో నిజం లేకపోలేదు.పవన్ కళ్యాణ్ తో సినిమా చెయ్యాలంటే అది ఎప్పటికి అవుతుందో తెలియదు.

అలాంటి సమయంలో నాగవంశీ ఎన్టీఆర్ ని తన 50 వ సినిమా కోసం ఎంచుకోవడం తెలివైన పనే అని చెప్పాలి.అలా అని ఇక్కడ పవన్ ఫ్యాన్స్ ఫీలవ్వాల్సిన పనే లేదు.

మరి నాగ వంశీ చెప్పినట్టుగా సితార బ్యానర్లో 50వ సినిమాను ఎన్టీఆర్ తోనే పూర్తి చేస్తారా లేదా అనేది చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube