సినిమాల్లో ఉండే స్టార్లు.స్టార్లు గా మారారంటే దానికి కారణం కేవలం ప్రేక్షకులు మాత్రమే.
ప్రేక్షకులు అభిమానించి గుండెల్లో పెట్టుకుని ఇక సినిమాలను ఆదరించడం వల్లే ఇప్పుడు సినిమాల్లో స్టార్లుగా వెలుగుతున్న వారు నిలబడగలిగాడు అని చెప్పాలి.ఇక అలాంటి స్టార్స్ ఎప్పుడూ ప్రేక్షకులు అందరికి ఆదర్శంగా నిలిచే పనులు చేస్తూ ఉండాలి.
ఎప్పుడూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ఉండాలి.డబ్బులకు ఆశపడి ఏది అది చేసి ఇక అటు ఏకంగా తన అభిమానించిన వాళ్లనే హర్ట్ చేయడం లాంటివి అసలు చేయకూడదు.
ఇప్పుడు ఇలాంటివి చేసి బాలీవుడ్లో అగ్ర హీరోలు అందరూ కూడా దెబ్బకు దిగి వచ్చారు.
అక్షయ్ కుమార్ ఇటీవలే ఒక పాన్ మసాలా యాడ్ లో కనిపించాడు.దీంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు.దీంతో దెబ్బకు దిగి వచ్చి ఆ ప్రకటన నుంచి తప్పుకుంటున్న అంటూ సోషల్ మీడియాలో ప్రకటించడమే కాదు అభిమానులకు క్షమాపణలు చెప్పాడు అక్షయ్ కుమార్.
ఇక హీరోలే దేవుళ్ళు అంటూ అభిమానులు పాలాభిషేకాలు చేస్తుంటే ఈ పాన్ మసాలా యాడ్స్ ఏంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.కాగా ఇటీవలే అక్షయ్ కుమార్ ఇలైచి యాడ్ చేసాడు అన్న విషయం తెలిసిందే.
ఇప్పుడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు బాలీవుడ్ కండల వీరుడు టైగర్స్ ష్రాప్ తో కలిసి పాన్ బహార్ ప్రకటన చేస్తున్నాడు.
ఇక మరోవైపు లెజెండ్ అమితాబ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ కమల పసంద్ అనే గుట్కా సబ్సిడరీ ప్రోడక్ట్ ప్రకటనలో నటిస్తున్నారు.ఇక పాన్ బెస్ట్ విమాల్ యాడ్ లో షారుక్ ఖాన్ అజయ్ దేవగన్ కలిసి ప్రమోద్ చేశారు.అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే స్టార్ హీరోలు ఏం చేసినా నడిచిపోతుంది అనే రోజులు పోయాయి.
ఇక అభిమానుల ఆగ్రహానికి గురైతే చివరికి సార్లు కూడా కామన్ మ్యాన్ లాగా మారిపోతారు అన్నది తెలుస్తుంది.ఇకపోతే ఇటీవల అక్షయ్ కుమార్ కు జరిగింది ఇక రానున్న రోజుల్లో జరగడం ఖాయం అన్నది ప్రస్తుతం అందరూ అనుకుంటున్న మాట.