చెప్పుల దుకాణం కు.. చిరంజీవి సినిమా టైటిల్.. ఎందుకో తెలుసా?

సాధారణంగా సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ప్రభావితం చేస్తూ ఉంటాయి అని చెబుతూ ఉంటారు.ఇక సినిమాల్లో హీరో పాత్రలతో తమని తాము ఊహించుకునే ప్రేక్షకులు ఇక సినిమాల్లో హీరోలు సాధించినట్లుగానే రియల్ లైఫ్ లో కూడా ఏదో ఒక గొప్ప విషయం సాధించాలి అని భావిస్తూ ఉంటారు.

 Why Chiranjeevi Name Used For Slipper Shop Details, Megastar Chiranjeevi, Swayam-TeluguStop.com

సినిమాలో హీరో పాత్ర చేసినట్లుగానే నిజజీవితంలో ప్రేక్షకులు ప్రయత్నిస్తూ ఉంటారు.ఇక్కడ దాదాపు ఇలాంటిదే జరిగింది.

ఏకంగా మెగాస్టార్ చిరంజీవి నటించిన ఒక సినిమా వల్ల ఏకంగా చెప్పుల షాపు పేరును మార్చేసాడు యజమాని.అదేంటి చిరంజీవి సినిమాకు చెప్పుల షాప్ పేరు మార్చడానికి గల సంబంధం ఏంటి అని అనుకుంటున్నారు కదా.

ఇక ఆ విషయం గురించి మాట్లాడే ముందు మనం ది గ్రేట్ చిరంజీవి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి కాస్త ఇంట్రడక్షన్ ఇస్తే బెటర్.ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా చిత్రపరిశ్రమకు ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకుల మెగాస్టార్ గా మారిపోయాడు.

తన డాన్సులతో తన నటనతో కామెడీ టైమింగ్తో తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్త ట్రెండ్కు నాంది పలికాడు మెగాస్టార్ చిరంజీవి.దాదాపు 150కి పైగా సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించారు ఆయన.ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో మెగా అనే ఒక సామ్రాజ్యాన్ని నిర్మించారు.ఇక మెగాస్టార్ నటించి మెప్పించిన సినిమాలలో అటు స్వయంకృషి కూడా ఒకటి.

మెగాస్టార్ చిరంజీవి నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉండే సినిమా ఇది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

Telugu Chiranjeevi, Vishwanath, Slippers Shop, Sumalatha, Swayamkrushi, Tollywoo

ఇక కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన విజయశాంతి సుమలత నటించారు.1987 సెప్టెంబర్ 3వ తేదిన సినిమా విడుదలై బ్లాక్బస్టర్ సాధించింది.చెప్పులు కుట్టుకునే వ్యక్తి స్వయంకృషితో ఎలా షాపు ఓనర్ గా ఎదిగాడు అన్నదే ఈ సినిమా స్టోరీ.సినిమాలో చిరంజీవి నటన అద్భుతం మహా అద్భుతం అని చెప్పాలి.

అయితే ఇక ఈ సినిమా సమయంలో చెప్పులు కుట్టే వ్యక్తి దగ్గర ట్రైనింగ్ తీసుకుని మరిన్ని పాత్రలు చేసారట చిరంజీవి.ఆ చిరంజీవి నటనకు ప్రశంసలు అందుకున్నాడు.

ఇది అప్పట్లో ఇక ఈ సినిమా ప్రభావంతో ఇక ఎంతో మంది చెప్పులు కుట్టేవారు.తమ దుకాణాల పేరును స్వయంకృషి గా మార్చుకున్నారు.

ఈ సినిమా ఎంతో మందిని ప్రభావితం చేసింది అని చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube