ద‌ట్ట‌మైన కనురెప్పల కోసం ఆరాట‌ప‌డుతున్నారా? అయితే ఇలా చేయండి!

దట్టమైన కనురెప్పలపై చాలా మంది ఆడవారు మ‌క్కువ చూపుతుంటారు.ఎందుకంటే కనురెప్పలు ఒత్తుగా ఉంటే క‌ళ్లు మరింత అందంగా మరియు ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

 Effective Home Remedy For Thick Eyelashes ,eyelashes, Eyelashes Growth Remedy, E-TeluguStop.com

అందుకే కనురెప్పలను ఒత్తుగా పెంచుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.కొంద‌రైతే ఆర్టిఫిషియ‌ల్ క‌నురెప్ప‌ల‌పై ఆధార‌ప‌డుతుంటారు.

అయితే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ అండ్ ఎఫెక్టివ్ హోం రెమెడీని పాటిస్తే చాలా సులభంగా దట్టమైన క‌నురెప్ప‌ల‌ను తమ సొంతం చేసుకోవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ హోం రెమెడీ ఏం.దాన్ని ఎలా తయారు చేసుకోవాలో.తెలుసుకుందాం పదండి.

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో గ్లాస్ వాటర్ పోయాలి.వాటర్ హీట్ అవ్వగానే అందులో రెండు టేబుల్ స్పూన్ల అవిసె గింజలను వేసి ప‌ది నుంచి ప‌దిహేను నిమిషాల పాటు ఉడికిస్తే జెల్లి స్ట్రక్చర్ లోకి మారుతుంది.

అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పల్చటి వస్త్రం సహాయంతో అవిసె గింజ‌ల జెల్‌ను సపరేట్ చేసుకోవాలి.

ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు అవిసె గింజల జెల్, వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఆ తర్వాత అందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ ఆముదం, నాలుగు చుక్కలు విటమిన్ ఈ ఆయిల్ వేసుకొని అన్నీ కలిసేంత వరకు స్మూత్ తో మిక్స్ చేసుకోవాలి.

Telugu Tips, Eyelashes, Remedy, Latest, Thick Eyelashes, Thin Eyelashes-Telugu H

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక బాక్స్ లో నింపుకుని ఫ్రిజ్లో స్టోర్ చేసుకోవాలి.నైట్ నిద్రించే ముందు త‌యారు చేసి పెట్టుకున్న‌ మిశ్రమాన్ని కనురెప్పల‌కు అప్లై చేసుకుని ప‌డుకోవాలి.ప్రతి రోజూ ఇలా చేస్తే కేవ‌లం కొద్ది రోజుల్లోనే పల్చటి కనురెప్పలు దట్టంగా పెరుగుతాయి.

దాంతో మీ క‌ళ్లు సూప‌ర్ ఎట్రాక్టివ్‌గా మార‌తాయి.కాబ‌ట్టి, ఒత్తైన క‌నురెప్ప‌ల‌ను ఇష్ట‌ప‌డేవారు ఖ‌చ్చితంగా ఈ రెమెడీని పాటించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube