ఈ సమ్మర్లో స్వీట్స్ తింటే జరిగేది ఇదే!

సమ్మర్ హాలిడేస్ వచ్చాయంటే చాలు.విద్యార్థులు టూర్లు తిరగడానికి, నచ్చినవి లొట్టలేసుకుని తినడానికి సమయం కేటాయిస్తారు.

 This Is What Happens If You Eat Sweets In Summer Season Details, Summer, Sweets,-TeluguStop.com

అలా లొట్టలేసుకుని స్వీట్స్ ( Sweets ) తినేవారికి ఇపుడు ఒక షాకింగ్ న్యూస్.భారతదేశంలో తియ్యటి పదార్ధాలు అధికంగా తింటున్నారని తాజా నివేదకలు చెబుతున్నాయి.

దీని కారణంగానే చాలామంది షుగర్‌( Sugar ) బారిన పడుతున్నారని, శరీరంలో కొవ్వు పేరుకుపోయి గుండె సంబంధిత సమస్యలు, మూత్రపిండాలు, కాలేయ వ్యాధులతోపాటు.బాడీలో ఇన్సులిన్‌ వేగంగా పెంచుతోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

అవును, మీరు విన్నది నిజమే.స్వీట్స్ అధికాంగా తినడం కారణంగా చిన్న పిల్లలు( Children ) సైతం షుగర్ బారిన పడుతున్నారని తాజా సర్వేలు చెబుతున్నాయి.షుగర్ ఇదే స్థాయిలో పెరుగుతుంటే.భవష్యత్తులో ప్రభుత్వాలు ఈ హెచ్చరికలను ముద్రించే రోజు వస్తుందని వైద్య నిపుణులు అంటున్నారు.ఎందుకంటే.గతంతో పోలిస్తే.ఇపుడు మనదగ్గర షుగర్‌ బాధితులు పెరిగిపోయారు.2025 నాటికి దేశంలో షుగర్‌ బాధితులు 1,26000 కోట్లకు చేరుకుంటారని అంచనా.

అధికంగా ప్రాసెస్‌ చేసిన స్వీట్లు, తదితర పదార్ధాలను తినవద్దని న్యూటీషియన్లు గట్టిగా హెచ్చరిస్తున్నారు.స్వీట్‌ కంటెంట్‌ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఊబకాయం వంటి సమస్యలు కూడా ఇక్కడ ఎక్కువగా తలెత్తుతాయని అంటున్నారు.పండుగలు, శుభకార్యాల సమయంలో స్వీట్లు అందుబాటులో ఉన్నప్పటికీ మితంగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.ప్రస్తుతం చాలా మందిలో శారీరక శ్రమ కూడా తగ్గిపోవడంతో.షుగర్‌ కంటెంట్‌ త్వరగా జీర్ణం కాదని, తద్వారా.రోగాల బారిన పడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube