ప్లాస్టిక్ బాటిల్ లో నీళ్లు తాగడం వల్ల ఎటువంటి సమస్యలు వస్తాయో తెలుసా..?

ప్లాస్టిక్( Plastic ) ఎంత ప్రమాదకరమో స్కూల్ లో చదువుకుంటున్న రోజుల నుంచే తెలుసుకుంటూ ఉంటారు.కానీ ప్లాస్టిక్ వినియోగాన్ని మాత్రం తగ్గించరు.

 Do You Know The Problems Of Drinking Water In A Plastic Bottle Details, Plastic-TeluguStop.com

కార‌ణం తక్కువ ఖర్చుతో, తేలికగా, ఉపయోగించడానికి సౌకర్యంగా ఉండ‌ట‌మే.కానీ, విషపూరిత రసాయనాలు మరియు రంగులను ఉపయోగించి ప్లాస్టిక్ ను తయారు చేస్తారు.

ప్లాస్టిక్ పాడవడానికి వందల సంవత్సరాలు పడుతుంది.ప్లాస్టిక్ వ్యర్థాలు భూమిలో శాశ్వతంగా నిలిచిపోవ‌డ‌మే కాకుండా పర్యావరణంలో నీరు, గాలి నాణ్యతను త‌గ్గిస్తాయి.

అటువంటి ప్లాస్టిక్ మన రోజూవారీ జీవితంలో ఏదో విధంగా భాగం అవుతూనే ఉంటుంది.

ముఖ్యంగా ప్లాస్టిక్ బాటిల్ లో నీళ్లు( Plastic Water Bottle ) పట్టుకుని తాగడం అనేది ప్రస్తుత కాలంలో సాధార‌ణంగా మారింది.

ఈ నేప‌థ్యంలోనే ప్లాస్టిక్ బాటిల్ లో నీళ్లు తాగడం వల్ల ఎటువంటి సమస్యలు వస్తాయి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ప్లాస్టిక్ బాటిల్స్ మైక్రోప్లాస్టిక్‌లు మరియు నానోప్లాస్టిక్‌లను కలిగి ఉంటాయి, ఇవి శరీరంలోకి శోషించబడి మెదడు, మూత్రపిండాలు, కాలేయం మరియు ఇతర అవయవాలను దెబ్బ తీస్తాయి.

Telugu Cancer, Damage, Hazards, Heart Problems, Micro Plastics, Plastic, Plastic

అలాగే ప్లాస్టిక్ బాటిల్స్ తయారీలో బిస్ఫినాల్-ఎ వంటి రసాయనాలు ఉపయోగిస్తారు.ఈ కెమికల్స్ బాటిల్ నుంచి వాట‌ర్ లోకి లీకై మ‌న బాడీలోకి చేర‌తాయి.ఇది హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తుంది.అంతేకాకుండా సంతానోత్పత్తి సమస్యలు, మానసిక స్థితి దెబ్బ తిన‌డం, క్యాన్సర్ మరియు గుండె సమస్యల వంటి ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి.

Telugu Cancer, Damage, Hazards, Heart Problems, Micro Plastics, Plastic, Plastic

గరిష్ఠ వేడి లేదా సూర్యరశ్మి కింద ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటే వాటి నుంచి నీటిలోకి హానికర రసాయనాలు రిలీజ్ అవుతాయి.ఆ వాట‌ర్ ను తాగ‌డం వ‌ల్ల నాడీ వ్యవస్థపై ప్రతికూల ప్ర‌భావం ప‌డుతుంది.క్యాన్స‌ర్( Cancer ) రిస్క్ కూడా పెరుగుతుంది.కాబ‌ట్టి ఇక‌నైనా ప్లాస్టిక్ వాడ‌కాన్ని త‌గ్గిద్దాం.ఆరోగ్యాన్ని మ‌రియు పర్యావరణాన్ని కాపాడుకుందాం.ప్లాస్టిక్ వాట‌ర్ బాటిల్స్ కు బదులుగా గ్లాస్, స్టీల్ వంటి పర్యావరణానికి అనుకూలమైన పదార్థాలు ఉపయోగించ‌డం ఉత్త‌మం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube