గత కొద్దిరోజులుగా మంచు కుటుంబంలో( Manchu Family ) పెద్ద ఎత్తున గొడవలు చోటు చేసుకుంటున్న సంగతి మనకు తెలిసిందే.అయితే గత నాలుగు రోజుల క్రితం పెద్ద ఎత్తున మంచు కుటుంబ సభ్యులు పోట్లాడటమే కాకుండా దాడి కూడా చేసుకున్నారు.
అయితే ఉన్నఫలంగా ఈ గొడవలు అన్నింటికీ కూడా స్వస్తి పలకడంతో అంత సర్దుమనిగిందని భావించారు.కానీ మరోసారి ఈ కుటుంబంలో గొడవలు మొదలయ్యాయని తెలుస్తుంది.
మంచు విష్ణు( Manchu Vishnu ) ఏకంగా తన ఫ్యామిలీని చంపడానికి కుట్ర చేశారు అంటూ మనోజ్( Manchu Manoj ) పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.దీంతో మరోసారి ఈ కుటుంబంలో గొడవలు చోటుచేసుకున్నాయి.
తన ఇంట్లోని జనరేటర్లో చక్కెర కలిపిన డీజిల్ పోసి.విద్యుత్ సరఫరాలో భయంకరమైన హెచ్చుతగ్గులు వచ్చేలా చేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు.ఆ సమయంలో మా అమ్మతో పాటు నా తొమిది నెలల చిన్నారి భార్య ఇతర బంధువులందరూ కూడా ఎంతో భయాందోళనలకు గురి అయ్యాము అంటూ మనోజ్ ఫిర్యాదుల పేర్కొన్నారు.అయితే మా అన్నయ్య విష్ణుతో పాటు అతని అనుచరులు ఈ కుట్రకు పాల్పడ్డారంటూ మనోజ్ ఫిర్యాదులో పేర్కొన్నారు.
మా అమ్మ పుట్టినరోజు కావడంతో ఈ పుట్టినరోజును అడ్డుపెట్టుకొని విష్ణు అనుచరులు తాను ఇంట్లో లేని సమయంలో వచ్చి ఈ దాడికి పాల్పడినట్లు తెలియజేశారు.విష్ణు, అతడి అనుచరులపై దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని మనోజ్ పోలీసులను కోరాడు.తనకు తన కుటుంబానికి భద్రత కల్పించాలని మనోజ్ పోలీసులకు విజ్ఞప్తి చేశాడు.ఇలా మమ్మల్ని చంపటానికే పెద్ద ఎత్తున కుట్రలు చేస్తున్నారని మాకు తన అన్నయ్య నుంచి రక్షణ కల్పించాలి అంటూ మనోజ్ ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో మరోసారి వీరి మధ్య గొడవలు మళ్లీ మొదటికే వచ్చాయని తెలుస్తుంది.
మరి మనోజ్ చేసిన ఈ ఫిర్యాదు పై విష్ణు ఏ విధంగా స్పందిస్తారనేది తెలియాల్సి ఉంది.