సాధారణంగా ఈ మధ్య కాలంలో చెడు ఆహార అలవాట్లు, అనారోగ్యకరమైన జీవన శైలి కారణంగా చిన్న వయసులోనే జుట్టు రాలడం, నెరిసే సమస్యలను చాలా మంది ప్రజలు ఎదుర్కొంటున్నారు.అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు మార్కెట్లో లభించే చాలా రకాల రసాయనాలతో కూడిన ప్రొడక్ట్స్ ను ఉపయోగిస్తున్నారు.
అయినప్పటికీ ఎలాంటి ఫలితాలు పొందలేకపోతున్నారు.
అంతేకాకుండా వాటిని వినియోగించడం వల్ల జుట్టు బలహీనంగా మారుతుంది.
అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఈ క్రింది జాగ్రత్తలను తప్పకుండా పాటించడం మంచిది అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.హెయిర్ ఎక్స్పర్ట్స్ చెప్పినదాని ప్రకారం జుట్టును తడపడం వల్ల జుట్టు మూలాలు బలహీనంగా మారుతాయి.
దీంతో వాటిని దువ్వాడం అవి రాలిపోయే అవకాశాలు ఎక్కువ గా ఉన్నాయి.

కాబట్టి తరచుగా జుట్టు సమస్యతో బాధపడేవారు తప్పకుండా జుట్టు ఆరిపోయిన తర్వాత దువ్వుకోవాల్సిన అవసరం ఉంది.జుట్టు బలహీనంగా ఉన్నవారు, ఇతర సమస్యలతో బాధపడుతున్న వారు కూడా తప్పకుండా జుట్టు పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం మంచిది.తలస్నానం చేసిన తర్వాత తలలో నీరు అలాగనే ఉండిపోతుంది.
దీని వల్ల వెంట్రుకలు అతుక్కొని పోతాయి.

ఈ క్రమంలో దువ్వెనని ఉపయోగించడం వల్ల చాలా రకాల జుట్టు సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.ముందుగా జుట్టును రెండు భాగాలుగా చేసుకోవాలి.ఆ తర్వాత వాటిని కలపి దువ్వడం మంచిది.
ఇలా చేయడం వల్ల జుట్టుకు ఎలాంటి నష్టం ఉండదని చెబుతున్నారు.ఇంకా చెప్పాలంటే జుట్టు ను ముందు పూర్తిగా ఆరడం ఎంతో మంచిది.
ఆ తర్వాత జుట్టుకు నూనెను రాయాలి.ఇలా చేయడం వల్ల నూనె జుట్టు మూలాలకు చేరుతుంది.దీని వల్ల జుట్టు పూర్తి పోషణలను పొందుతుంది.