ఆ మాటకు మబ్బులు విడిపోయాయి.. హరీష్ శంకర్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్,( Director Harish Shankar ) టాలీవుడ్ హీరో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కాంబినేషన్లో తెరకెక్కనున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్.( Ustaad Bhagat Singh ) ఈ సినిమాను పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల సమయం కంటే ముందే ఓకే చేసిన విషయం తెలిసిందే.

 Harish Shankar About Pawan Kalyan And Salman Khan Movie Details, Harish Shankar,-TeluguStop.com

ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా అనేక రకాల కారణాల వల్ల వాయిదా పడుతూనే వస్తోంది.ఇప్పటికే కొంతమేర షూటింగ్ ని కూడా జరుపుకుంది.

అలాగే ఈ సినిమాకు సంబంధించిన ఎన్నో రకాల వార్తలు కొన్ని అప్డేట్లు కూడా వినిపించిన విషయం తెలిసిందే.ఇవి సినిమాపై అంచనాలను పెంచాయి.

Telugu Harish Shankar, Harishshankar, Pawan Kalyan, Pawankalyan, Salman Khan, Us

ఇకపోతే ఈ సినిమా ఇప్పట్లో విడుదల అయ్యేలా కనిపించడం లేదు.అందుకు గల కారణం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు నిర్వహిస్తూ బిజీ బిజీగా ఉన్నారు.ఇది ఇలా ఉంటే తాజాగా డైరెక్టర్ హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా గురించి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.పవన్‌ కల్యాణ్‌ కోసం ఎన్నికల ముందు ఒక స్క్రిప్ట్ అనుకున్నాము.

ఆ తర్వాత కొన్ని మార్పులు చేశాము.ఇప్పుడు అంతా రెడీ.

కల్యాణ్‌ గారి డేట్స్‌ చూసుకొని, త్వరలోనే సినిమా ప్రారంభిస్తాము.నేను మాత్రం మూడు నాలుగేళ్ల నుంచి సిద్థంగానే ఉన్నాను.

ప్రస్తుతం చేతిలో మూడు ప్రాజెక్టులు ఉన్నాయి.

Telugu Harish Shankar, Harishshankar, Pawan Kalyan, Pawankalyan, Salman Khan, Us

కేవీఎన్‌, మైత్రీ మూవీ మేకర్స్‌, సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ కు ఒప్పుకున్నాను.ఇక సల్మాన్‌ విషయానికి వస్తే.ఇప్పటి దాకా రెండు మీటింగ్స్‌ అయ్యాయి.

మేమిద్దరం సినిమాను ఒకే కోణం నుంచి చూస్తున్నాము.అంతే కాకుండా ఎలాంటి కథ తీయాలనే విషయంపై ఏకాభిప్రాయం ఉంది.

సల్మాన్‌ తో త్వరలోనే సినిమా ఉంటుంది.దీనిని మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించనుంది అని తెలిపారు హరీష్ శంకర్.

ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube