టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన రష్మిక మందన్న( Rashmika Mandanna ) ఈ మధ్య కాలంలో వరుసగా మూడు 1000 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించి మంచి లాభాలను సొంతం చేసుకోవడం గమనార్హం.అయితే సికిందర్ మూవీ( Sikandar Movie ) మాత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని సొంతం చేసుకోలేదు.
ఈ సినిమా అటు సల్మాన్ ఇటు మురుగదాస్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచే అవకాశాలు అయితే ఉన్నాయి.
రిలీజ్ కు ముందే లీక్ కావడం సికిందర్ సినిమాకు మైనస్ అయిందని చెప్పవచ్చు.
ఈ సినిమాలో రష్మిక లుక్స్ కూడా ఆకట్టుకునేలా లేవు.సల్మాన్ ఖాన్( Salman Khan ) తన యాక్టింగ్ తో ప్రేక్షకులను మెప్పించే విషయంలో పూర్తిస్థాయిలో ఫెయిలయ్యారు.
సినిమా ఫ్లాట్, సినిమాటోగ్రఫీ మినహా ఈ సినిమాలో చెప్పుకోదగ్గ పాజిటివ్ అంశాలు అయితే లేవని చెప్పవచ్చు.

ఈ సినిమాలో రష్మిక పాత్ర కూడా సినిమా మొదలైన అరగంటకే చనిపోతుంది.ఏఆర్ మురుగదాస్ కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా సికిందర్ నిలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పవచ్చు.సల్మాన్ ఖాన్ అభిమానులకు సైతం ఈ సినిమా ఏ మాత్రం నచ్చలేదంటే ఈ మూవీ ఏ రేంజ్ డిజాస్టర్ అనే ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది.
ఈ సినిమా రిజల్ట్ గురించి రష్మిక ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

రష్మిక రెమ్యునరేషన్ ఒకింత భారీ స్థాయిలో ఉందనే సంగతి తెలిసిందే.రష్మిక భవిష్యత్తు ప్రాజెక్టులు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాయో చూడాల్సి ఉంది.రష్మిక కథల ఎంపికలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం అయితే ఉంది.
రష్మికను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.రష్మిక ఫ్లాపుల పరంపర మొదలైందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వినిపిస్తున్నాయి.
రష్మిక భవిష్యత్తు సినిమాల ప్లానింగ్ ఏ విధంగా ఉండనుందో చూడాల్సి ఉంది.