టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.వరుస సినిమాలలో నటిస్తూ ఈతరం హీరోలకు గట్టి పోటీని ఇస్తున్నారు చిరంజీవి.
సినిమా హిట్, ప్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు చిరు.ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి చివరగా వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.
ఈ సినిమా కంటే ముందు భోళా శంకర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించారు.ఈ సినిమా విడుదల అయ్యి ఫ్లాప్ అయిన విషయం తెలిసిందే.
ఈ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ అవడంతో చిరంజీవి తన లైనప్ మొత్తం మార్చేశారు.

వెంకీ కుడుములతో చేయాల్సిన సినిమా ఆపేశారు.కూతురు నిర్మాతగా కల్యాణకృష్ణ దర్శకత్వంలో చేయాల్సిన ప్రాజెక్టును సైతం పక్కన పెట్టారు.దీంతో ఆయన సినిమాల ఆర్డర్ మారిపోయింది.
ఒకప్పుడు మెగా155, మెగా156 అనే హ్యాష్ ట్యాగ్స్ తో పాపులరైన చిరంజీవి సినిమాలు( Chiranjeevi Movies ) ఆ తర్వాత నంబరింగ్ ను పక్కన పెట్టేశాయి.వశిష్ఠ దర్శకత్వంలో చేస్తున్న సినిమాకు కూడా టైటిల్ పెట్టకముందు మెగా157 అంటూ ప్రస్తావించినప్పటికీ, ఆ తర్వాత ఆ నంబరింగ్ ను వాళ్లు కూడా పక్కన పెట్టారు.
విశ్వంభర( Vishwambhara Movie ) టైటిల్ ఎనౌన్స్ చేసిన తర్వాత మెగా 157 అనే హ్యాష్ ట్యాగ్ పూర్తిగా సైడ్ అయిపోయింది.

ఇలా చిరంజీవి సినిమాల ఆర్డర్ పై కన్ఫ్యూజన్ కొనసాగుతున్న సమయంలో మరోసారి మెగా 157 అంటూ పోస్టర్ పడింది.ఇది అనీల్ రావిపూడి( Anil Ravipudi ) సినిమా మేటర్.తాజాగా ఈ సినిమా లాంచ్ ని పెట్టుకున్నారు.
అనిల్ రావిపూడి చిరంజీవి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా మెగా157 టైటిల్ తో తెరకెక్కనుంది.దీంతో విశ్వంభరపై అనుమానాలు మొదలయ్యాయి.
ముందుగా అనీల్ రావిపూడి సినిమా రిలీజైన తర్వాతే, విశ్వంభర రిలీజ్ చేస్తారా అనే డౌట్స్ తెరపైకి వచ్చాయి.అయితే నిజానికి ఈ విషయంలో కన్ఫ్యూజన్ అక్కర్లేదు.
అనీల్ రావిపూడి సినిమాకు ఏ నంబర్ ఇచ్చుకున్నప్పటికీ, ముందుగా రిలీజయ్యేది విశ్వంభర మాత్రమే.సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న ఈ సినిమాను జులై 24 లేదా ఆగస్ట్ 21న విడుదల చేయాలని అనుకుంటున్నారు.
విశ్వంభర రిలీజైన 5,6 నెలల గ్యాప్ లో అనీల్ రావిపూడి సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వస్తుంది.విశ్వంభర సినిమా విడుదల తేదీపై ప్రకటన వస్తే, అనీల్ రావిపూడి సినిమా నంబర్ ఎంత అనేది క్లారిటీ వస్తుంది.
అప్పటి వరకు ఈ కన్ఫ్యూజన్ తప్పదు.