టాలీవుడ్ హీరోయిన్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే( Pooja Hegde ) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ బిజీబిజీగా ఉన్న విషయం తెలిసిందే.మొన్నటి వరకు తెలుగులో వరుసగా సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన పూజా హెగ్డే ఇప్పుడు టాలీవుడ్ లో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ లో బిజీ బిజీ అయిపోయింది.
సల్మాన్ ఖాన్ తో ఇటీవల కిసీ కా భాయ్.కిసీ కీ జాన్ చిత్రంలో కనిపించిన ముద్దుగుమ్మ ఇటీవలే దేవా మూవీలో ప్రేక్షకుల ముందుకొచ్చింది.
షాహిద్ కపూర్ హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది.

ఇక సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా బుట్టబొమ్మకు అవకాశాలు మాత్రం అవకాశాలు క్యూ కడుతున్నాయి.ప్రస్తుతం కోలీవుడ్ లో రెట్రో,( Retro ) జన నాయగన్( Jana Nayagan ) లాంటి సినిమాల్లో నటిస్తోంది.అంతేకాకుండా బాలీవుడ్ లో వరుణ్ ధావన్ తో సరసన హై జవానీ తో ఇష్క్ హోనా హైలో కూడా పూజా నటించనుంది.
ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పూజా హెగ్డే తన కెరీర్ లో ఎదురైన అనుభవాలను పంచుకుంది.ఇటీవల ఒక తమిళ చిత్రం కోసం ఆడిషన్ కు వెళ్లగా తనను తిరస్కరించారని బుట్టబొమ్మ తెలిపింది.
అయితే తనను ఎందుకు రిజెక్ట్ చేశారో కూడా వివరించింది.ఆ పాత్రకు నా వయస్సు సరిపోదని అందువల్లే తిరస్కరించినట్లు పూజా వెల్లడించింది.

నా కంటే కాస్తా ఎక్కువ వయస్సు ఉన్న వారిని ఎంపిక చేశారని పూజా చెప్పుకొచ్చింది.ఇలా ఆడిషన్స్‌కు వెళ్లడం వల్ల ఒక నటిగా తనను తాను నిరూపించుకోవడానికి సహాయపడుతుందని పూజా హెగ్డే తెలిపింది.తాను ఎలాంటి పాత్రనైనా చేయగలననే నమ్మకం మేకర్స్ కు కలిగించడమే తన ఉద్దేశమని తెలిపింది.తాను కష్టపడి పని చేయడానికి వెనకాడనని ఆడిషన్స్ కు వెళ్లేందుకు అహంకారం ప్రదర్శించనని ఆమె తెలిపింది.
అ ఏదేమైనా ఒక నటిగా ఆడిషన్స్ కు వెళ్లడానికి తాను ఎప్పుడు సిగ్గుపడనని అంటోంది మన బుట్టబొమ్మ.ఈ సందర్భంగా పూజ హెగ్డే చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.