చుండ్రు( Dandruff ) సమస్య విపరీతంగా వేధిస్తుందా.? ఎన్ని ఖరీదైన షాంపూలు వాడిన చుండ్రు పోవడం లేదా.? అయితే వర్రీ అవ్వకండి.నిజానికి చుండ్రును పోగొట్టే ఔషధాలు మన వంటింట్లోనే ఉన్నాయి.
వాటిని ఉపయోగించి చుండ్రుకు చెక్ పెట్టే ఒక సూపర్ న్యాచురల్ టానిక్ ను తయారు చేసుకోవచ్చు.
అందుకోసం ముందుగా ఒక అంగుళం అల్లం( Ginger ) ముక్కను తీసుకొని వాటర్ తో శుభ్రంగా కడిగి సన్నగా తురుముకోవాలి.
అలాగే ఒక నిమ్మ పండును( Lemon ) తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో గ్లాస్ వాటర్ పోసుకోవాలి.
వాటర్ బాగా బాయిల్ అయ్యాక అందులో మూడు టేబుల్ స్పూన్లు బియ్యం( Rice ) వేసుకోవాలి.అలాగే అల్లం తురుము మరియు నిమ్మ ముక్కలు వేసుకుని పది నుంచి పన్నెండు నిమిషాల పాటు ఉడికించాలి.
ఆపై స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.

గోరువెచ్చగా అయ్యాక ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ ఆవనూనె( Mustard Oil ) వేసి బాగా మిక్స్ చేశారంటే మన హెయిర్ టానిక్ అనేది రెడీ అవుతుంది.ఈ టానిక్ స్కాల్ప్ కి ఒకటికి రెండుసార్లు అప్లై చేసుకుని బాగా మసాజ్ చేసుకోవాలి.గంట లేదా గంటన్నర అనంతరం తేలికపాటి షాంపూను ఉపయోగించి శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.
వారానికి ఒకసారి ఈ టానిక్ ను కనుక వాడితే చుండ్రు సమస్యకు శాశ్వతంగా గుడ్ బై చెప్పవచ్చు.

చుండ్రు నివారణలో ఈ టానిక్ ఉత్తమంగా పనిచేస్తుంది.ఈ టానిక్ ను ఉపయోగించడం వల్ల స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ దూరమవుతాయి.చుండ్రు సమస్యకు చెక్ పడుతుంది.
అంతేకాకుండా ఈ టానిక్ తలలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది.హెయిర్ రూట్స్ ను బలోపేతం చేస్తుంది.జుట్టు రాలటాన్ని నివారించి ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది.కాబట్టి చుండ్రు సమస్యతో బాధపడుతున్న వారు మాత్రమే కాకుండా హెయిర్ ఫాల్ ను కంట్రోల్ చేసుకోవాలని భావించేవారు కూడా ఈ టానిక్ ను తయారు చేసుకుని వాడొచ్చు.