ఉదయం ఖాళీ కడుపుతో ఈ ఆహార పదార్థాలను తింటున్నారా? అయితే ఇది మీకోసమే..!

మీ మానసిక స్థితి మీరు రోజు ఉదయం తినే ఆహారం( Mornign Food ) పై ఆధారపడి ఉంటుంది.అందువల్ల ఉదయం ఆరోగ్యకరమైన అల్పాహారంతో మీ రోజును మొదలుపెట్టడం ఎంతో ముఖ్యం.

 Foods To Avoid Eating In The Morning Empty Stomach,avoid Fooda,morning,break Fas-TeluguStop.com

పోషకాలు, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, చక్కెర అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల మీ శక్తి స్థాయిలు తగ్గుతాయి.ఇది మధుమేహం ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది.

అలాగే రక్తపోటును కూడా పెంచుతుంది.అందుకే ఉదయం పూట సరైన మోతాదులో ప్రోటీన్లు, విటమిన్లు, పీచు పదార్థాలు, క్యాల్షియం ఉన్న ఆహారం తీసుకోవడం ఎంతో అవసరం.

Telugu Avoid Fooda, Break Fast, Coffee, Empty Stomach, Tips, Telugu-Telugu Healt

ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఆహారాలను ఉదయం పూట తినకపోవడమే మంచిది.ఉదయం సమయంలో కాఫీ తాగడం( Coffee ) వల్ల కార్టిసాల్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంది.ఎందుకంటే ఉదయాన్నే హార్మోన్ ఎక్కువగా ఉంటుంది.కాఫీ వినియోగం కార్టిసాల్ ను మరింత పెంచుతుంది.అలాగే హార్మోన్ల పై ప్రభావం పడుతుంది.ఇది బీపీని పెంచుతుంది.

మీకు కాఫీ అలవాటు ఉంటే ఖాళీ కడుపుతో కాకుండా అల్పాహారం తర్వాత తాగడం మంచిది.కొంతమంది ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఆహారంగా పండ్ల రసన్ని తాగుతారు.

అయితే పండ్ల రసాలలో( Fruit Juices ) ఫైబర్ ఎక్కువగా ఉండదు.అందుకే దీన్ని ఉదయాన్నే తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది.

Telugu Avoid Fooda, Break Fast, Coffee, Empty Stomach, Tips, Telugu-Telugu Healt

అందువల్ల జ్యూస్ కు బదులుగా పండ్లను తీసుకోవచ్చు.నిమ్మరసం( Lemon Juice ), దోసకాయ రసం కలిపిన నీటిని ఖాళీ కడుపుతో సేవించవచ్చు.ఆకలిని నియంత్రించుకోవడానికి కొందరు ఉదయాన్నే పాన్ కేకులు తింటారు.దీన్ని ఖాళీ కడుపుతో తింటే రోజంతా ఏదో ఒకటి తినాలి అనిపిస్తూ ఉంటుంది.అలాగే దాహం పెరుగుతుంది.ఉదయం నిద్ర లేచిన వెంటనే టీ తాగడం వల్ల కాఫీ లాగా మేలు కంటే ఎక్కువ హాని కలుగుతుంది.

ఉదయం ఖాళీ కడుపుతో ఎక్కువ మొత్తంలో చక్కెర, కెఫీన్, నికోటిన్ తీసుకోవడం అసలు మంచిది కాదు.ఇది ఎసిడిటీ, గుండెల్లో మంట, రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది.

కాబట్టి ఎంత వీలైతే అంత వీటికి దూరంగా ఉండటమే మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube