ప్రస్తుత సమాజంలో చాలా మంది ప్రజలకు ఆహారం విషయంలోను, జీవన శైలి మారడం వల్ల వైద్యులకు కూడా అంతు చిక్కని వ్యాధులు వస్తున్నాయి.ముఖ్యంగా చెప్పాలంటే వయస్సు తో సంబంధం లేకుండా ఎంతో మంది ప్రజలు ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడి తమ ప్రాణాలను కోల్పోతూ ఉన్నారు.
ఇందులో ముఖ్యంగా చాలా మంది డయాబెటిస్ వ్యాధితో బాధపడుతున్నారు.దీని కారణంగా వీరు కొన్ని ఆహార పదార్థాలకు కూడా దూరంగా ఉంటారు.
అయితే కచ్చితంగా ఆహార నియమాలను పాటిస్తేనే ఈ వ్యాధి అదుపులో ఉంటుంది.ఈ వ్యాధి కొందరిలో వంశపార్య పరంగా వస్తే ఇంకొందరిలో జీవన శైలి అదుపు తప్పడం వల్ల కూడా వస్తుంది.

ఒకప్పుడు వృద్ధాప్యంలో మాత్రమే ఈ వ్యాధి లక్షణాలు బయటపడేవి.కానీ ఇప్పుడు యుక్త వయసు లో ఉన్న వారికి సైతం ఈ వ్యాధి వస్తుంది.ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ పెట్టి, శరీరానికి తగిన వ్యాయామం( Exercise ) సమతుల్య ఆహారాన్ని తీసుకుంటూ ఉంటే ఈ వ్యాధి అదుపులో ఉంటుంది.అయితే డయాబెటిస్ ( Diabetes )రాకుండా ఉండాలంటే క్రమం తప్పకుండా పాలు తాగాలి.
అలా చేసిన వారు డయాబెటిస్ బారిన పడకుండా ఉన్నారని కొన్ని అధ్యయనాలలో తెలిసింది.

ముఖ్యంగా చెప్పాలంటే క్రమం తప్పకుండా పాలు తాగిన వారికి టైప్ 2 డయాబెటిస్ ( Type 2 diabetes )వచ్చే ప్రమాదం 30% తక్కువగా ఉందని పరిశోధకులు చేసినా పరిశోధనలలో తెలిసింది.ఈ పరిశోధనలో పాల్గొన్న నెదర్లాండ్స్‌లోని వాగెనింగెన్ విశ్వవిద్యాలయంలో పోషకాహార, ఆరోగ్య పరిశోధకుడు లోన్నెకే జాన్సెన్ డుయిజ్‌ఘుయిజ్‌సెన్ ఈ విషయాన్ని తెలిపారు.ఇప్పటికీ రోజుకు 12 గ్రాముల లాక్టోజ్ ను తీసుకోవచ్చని పరిశోధనలలో ఆయన వెల్లడించారు.
ఇప్పటికీ రోజుకు 12 గ్రాముల లాక్టోస్ ను తీసుకుంటున్న వారిలో డయాబెటిస్ వచ్చే ప్రమాదం చాలా తక్కువగా ఉందని ఈ పరిశోధనలలో తెలిసింది.