మంగళవారం పసుపు.. కుంకుమ కింద పడితే ఏం జరుగుతుందో తెలుసా?

మంగళవారం రోజు ఆంజనేయ స్వామి, దుర్గామాతను భక్తి శ్రద్ధలతో పూజిస్తారు.ఈ దేవతలకు ఈరోజు ఎంతో ప్రీతికరమైన రోజు.

 What Will Happen Pasupu And Kumkumar On Floor On Tuesday Pasupu, Kunkuma, Tuesd-TeluguStop.com

సాధారణ మంగళవారం రోజున కొన్ని అనుకోని సంఘటనలు జరిగినప్పుడు ఇలా జరగడం వల్ల అశుభమని అంటారు.ముఖ్యంగా మంగళవారం, శుక్రవారం పసుపు, కుంకుమ కింద పడితే ఏదో అశుభం జరుగుతుందని భావిస్తుంటారు.

అయితే అది కేవలం అపోహ మాత్రమేనని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.మంగళవారం, శుక్రవారం పసుపు, కుంకుమలు కింద పడితే అది శుభ సూచికంగా భావించాలని పండితులు చెప్తున్నారు.

మంగళవారం అనుకోకుండా లేదా పిల్లలు ఆడుకుంటూ పసుపు కుంకుమలను కిందకి పడేస్తూ ఉంటారు.ఆ రోజంతా మన మనసు కీడును శంకిస్తూ ఉంటుంది.పసుపు కుంకుమ కింద పడటం వల్ల ఏదైనా అశుభం జరుగుతుందేమోనని ఆందోళన చెందుతూ ఉంటారు.అలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదని పసుపు, కుంకుమ కింద పడటం వల్ల శుభం కలుగుతుంది.

పసుపు కుంకుమ కింద పడటం వల్ల సాక్షాత్తు భూదేవి మాతకు పసుపు, కుంకుమలను ఇచ్చినట్లు.మన ఇంటికి ఎవరైనా ఆడపడుచు వస్తే పసుపు కుంకుమలు ఇస్తారు.

అలాగే పసుపు కుంకుమ కింద పడినప్పుడు భూదేవి మాతకు తనకు కుంకుమ పెట్టమని సంకేతం.కుంకుమ పడిన చోట కొద్దిగా బొట్టు పెట్టి, మిగిలిన కుంకాని ఎవరూ తొక్క నటువంటి ప్రదేశంలో పెట్టవలెను.

మన ఇంట్లో ఏదైనా శుభకార్యం లేదా వ్రతం నిర్వహించేటప్పుడు కుంకుమ కింద పడితే అది శుభకరం.అమ్మవారు తనకు తానుగా మన చేత బొట్టు పెట్టించుకున్నట్లుగా భావించాలి.

ఇంతటి అదృష్టం భాగ్యాన్ని ఎప్పుడు కూడా దురదృష్టమని భావించకూడదు.మన ఇంటికి వచ్చే సుమంగళి కి బొట్టు పెట్టి పంపించాలి.

మంగళవారం రోజున ఎవరి నుంచి డబ్బులు తీసుకోకూడదు.మనకు ఏవైనా అప్పులు ఉంటే మంగళవారం తీర్చడం ద్వారా జీవితంలో ఎప్పుడు కూడా అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడదు అని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube