తెలుగు సంప్రదాయం ప్రకారం ప్రతి హిందూ మహిళ ఇంట్లో తులసి మొక్క కచ్చితంగా ఉంటుంది.తులసి మొక్క( Basil plant )ను పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా పూజలు చేస్తూ ఉంటారు.
అయితే మహిళలు శ్రద్ధగా పూజించే తులసి మొక్కలు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు రకాల మొక్కలు ఉన్నాయి.అసలు ఆ మొక్కల పేర్లు ఏంటి? అవి ఎలా ఉంటాయి? ఇప్పుడు తెలుసుకుందాం.
నిమ్మ తులసి
: ( Lemon Basil )నిమ్మ తులసి పేరు చాలావరకు ఎవరు విని ఉండరు.అయితే ఈ మొక్క ఆకులు నీలం రంగులో ఉంటాయి.
ఈ మొక్క ఆకులను ఆహారం నాణ్యతగా ఉంచడానికి, టీ తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు.అయితే నిమ్మ పండు లాగే దీని ఆకులు కూడా పుల్లగా ఉంటాయి.

అటవీ తులసి
: ( Forest basil )ఈ మొక్క ఎక్కువగా అడవులలో కనిపిస్తూ ఉంటుంది.ఈ తులసి మొక్క ఆకులు ఔషధ గుణం కలిగి ఉంటాయి.కాబట్టి వీటిని ఎక్కువగా ఔషధాలలో ఉపయోగిస్తారు.దీని ఆకులు కూడా చాలా పెద్దగా ఉంటాయి.ఈ మొక్క ఆకులను కూడా పూజకు ఉపయోగించరు.అలాగే దీనికి పూజలు కూడా చేయరు.

ఆఫ్రికన్ బేసిల్
🙁 African basil ) ఈ తులసి ఆఫ్రికాలో కనిపిస్తుంది.అడవి తులసి లాగా ఆఫ్రికన్ తులసి ఆకులు కూడా పెద్దవిగా ఉంటాయి.ఈ మొక్కలో కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.ఈ మొక్కను కూడా పూజలో ఉపయోగించరు.దీన్ని ఎక్కువగా ఆఫ్రికన్లు ఉపయోగిస్తారు.
రామ తులసి:
( Rama Tulsi )ఇది మన అందరికీ తెలిసిన మొక్కే.దీన్ని శుద్ధ తులసి అని కూడా పిలుస్తారు.ఈ రామ తులసి మొక్క ఆకులు ఆకుపచ్చని రంగులో ఉండి, మంచి సువాసనను కలిగి ఉంటాయి.అయితే హిందువులు ఈ మొక్కను తులసిగా భావించి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు.అలాగే ఆయుర్వేదంలో కూడా ఈ మొక్క అత్యంత ఔషధ గుణాలు ఉన్నదిగా పేర్కొనబడింది.