తెలంగాణలో రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి.ప్రతిపక్షం, అధికార పక్షంల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలతో రాజకీయాలు హాట్ హాట్ గా మారిపోతున్నాయి.
అయితే కేసీఆర్ ప్రతిపక్షాలకు ఏ మాత్రం విమర్షించే అవకాశం ఇవ్వకుండా తనదైన శైలిలో దూసుకుపోతున్న పరిస్థితులలో ప్రతిపక్షాలకు విమర్శించడానికి సరైన సమయం కోసం వేచి చూస్తున్న ప్రతిపక్షాలకు ఈటెల భూ వ్యవహారం అంశం మంచి అస్త్రంగా దొరికిందని చెప్పవచ్చు.ఇక తెలంగాణలో ఇంతలా కుంభకోణాలు జరుగుతున్నాయని, ఏకంగా రైతులే గగ్గోలు పెట్టే విధంగా తెలంగాణ మంత్రుల దారుణాలు కళ్ళ ముందే కనబడుతున్నాయని, తక్షణమే కేసీఆర్ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేసే అవకాశం ఉంది.
అయితే ఇప్పటికే అన్నీ తెగించి ప్రభుత్వం పై పరోక్షంగా విమర్శలు గుప్పిస్తున్న ఈటెల టార్గెట్ చేస్తారని తెలిసి ముందు నుండే ప్రిపేర్ అయినట్టు సీన్ అర్థమవుతుంది.ఏది ఏమైనా ఇక తన మంత్రి మీదే విచారణ జరిపించడంతో, ఇక దొరికిందే ఛాన్స్ ఇంకా చాలా మంది మంత్రులపై, కొందరు ఎమ్మెల్యేలపై కూడా అభియోగాలు ఉన్నాయని, వారిపై కూడా విచారణకు ఆదేశించాలని కేసీఆర్ ను ప్రతిపక్షాలు కేసీఆర్ ను డిమాండ్ చేసే అవకాశం ఉంది.
మరి ప్రతిపక్షాలు ఈ వ్యవహారంపై ఎలా స్పందిస్తాయనేది చూడాల్సి ఉంది.