మామూలుగా ఇదివరకటి రోజుల్లో రాయలసీమ నేపథ్యంలో చాలా సినిమాలు తెరకెక్కిన విషయం తెలిసిందే.రాయలసీమ అనగానే కడప అనంతపురం కర్నూలు జిల్లా భాషల యాసలలోనే ఎక్కువ సినిమాలను తీశారు.
ఫ్యాక్షన్ సినిమాలు కూడా ఆ మూడు జిల్లాలలో ఏదో ఒక దాన్ని ఎంచుకునేవారు.సీమలో భాగం అయిన చిత్తూరు జిల్లా( Chittoor District ) మీద ఫోకస్ ఉండేది కాదు.
కానీ ఈ మధ్య చిత్తూరు నేపథ్యంలో సినిమాలు పెరుగుతున్నాయి.అందుకు ముఖ్య కారణం.
పుష్ప( Pushpa ) అని చెప్పవచ్చు.చిత్తూరు సినిమా మొత్తం పూర్తిగా చిత్తూరు నేపథ్యంలోనే సాగుతుంది అన్న విషయం తెలిసిందే.
అందులో భాష కూడా సేమ్ అలాగే ఉంటుంది.

పుష్ప టు విజయంతో చిత్తూరు బ్యాక్‌డ్రాప్ కు క్రేజ్ మరింత పెరిగింది.గత కొన్నేళ్లలో వినరో భాగ్యము విష్ణు కథ, హరోం హర, 35 ఇలా చాలా సినిమాలు చిత్తూరు జిల్లా నేపథ్యంలో తెరకెక్కాయి.ఇప్పుడు ఇంకో క్రేజీ మూవీకి ఈ బ్యాక్ డ్రాప్ ఎంచుకున్నట్లు సమాచారం.
టాలీవుడ్ హీరో అక్కినేని అఖిల్( Akkineni Akhil ) నటిస్తున్న కొత్త సినిమా కూడా చిత్తూరు నేపథ్యంలోనే ఉండబోతోందట.వినరో భాగ్యము విష్ణు కథ చిత్ర దర్శకుడు మురళీ కృష్ణనే అఖిల్ కొత్త సినిమాను రూపొందించనున్న సంగతి తెలిసిందే.
మరోసారి అతను చిత్తూరు జిల్లా నేపథ్యంలో కథ సిద్ధం చేశాడట.

అతడి కథ నచ్చి స్వయంగా అఖిల్ తండ్రి నాగార్జునే( Nagarjuna ) ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారట.సుదీర్ఘ కసరత్తు తర్వాత ఎట్టకేలకు ఈ సినిమాను మొదలు పెట్టబోతున్నారట.ఈ నెల 14న ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్తుందట.
ఎన్నో ఆశలు పెట్టుకున్న ఏజెంట్ డిజాస్టర్ కావడంతో అఖిల్ ఈసారి చాలా గ్యాప్ తీసుకున్నాడట.దాదాపు రెండేళ్ల తర్వాత అతడి కొత్త చిత్రం సెట్స్ మీదికి వెళ్తోంది.
మరి ఈ విషయంలో అల్లు అర్జున్ ను ఫాలో అవుతున్న అఖిల్ ఎలాంటి సక్సెస్ ను అందుకుంటారు చూడాలి మరి.







